బడా ప్రొడ్యూసర్ చీకటి కోణం..అమ్మాయిని తల్లిని చేసిన ఘనుడు
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా తనదైన శైలిలో పనిచేస్తూ, వసతి హాస్టల్స్‌లో ఆకస్మిక తనిఖీలతో వార్తల్లో నిలిచే నేరెళ్ల శారద తాజాగా సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అమ్మాయిలను చీట్ చేస్తున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఒక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శారద మాట్లాడుతూ, టాలీవుడ్‌కు చెందిన ఓ పెద్ద పేరున్న నిర్మాత గురించి షాకింగ్ నిజాలు వెల్లడించారు. భార్యాపిల్లలు ఉన్నప్పటికీ, ఆ నిర్మాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని, పిల్లలను కని, ఆ తర్వాత మోసం చేశాడని ఆమె తెలిపారు.

ఆయన పేరు ఇక్కడ చెప్పకూడదు. కానీ ఆయన చాలా పెద్ద నిర్మాత. ఈ మధ్యనే ఆయన మూవీ ఒకటి చాలా పెద్ద హిట్ అయిందని చెబుతూ, ఆ బాధితురాలు న్యాయం కోసం తమ వద్దకు వచ్చిందని వివరించారు. కమిషన్ నోటీసులు సిద్ధం చేసినప్పటికీ, అనూహ్యంగా ఆ బాధితురాలు వెనుకడుగు వేయడం దురదృష్టకరమని ఆమె చెప్పుకొచ్చారు.
ఇలాంటి కేసులు చాలా సందర్భాల్లో జరుగుతున్నాయని శారద తెలిపారు. తమ వద్దకు బాధితులు వచ్చి బాధలు చెప్పుకున్నాక, కమిషన్ కేసు నమోదు చేసి సమయం ఇచ్చేసరికి వారు మళ్లీ రావడం లేదన్నారు. సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు పిలుచుకుని మాట్లాడుతారా? భయపెడతారా? మరేదైనా ఒప్పందం కుదురుతారా? ఏం జరుగుతుందో తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మూడు సిట్టింగ్‌ల తర్వాత బాధితులు వెనకడుగు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ప్రొఫెషన్ కోసం ఇండస్ట్రీకి వచ్చిన మహిళలను అడ్వాంటేజ్‌గా తీసుకోవడం సరికాదని శారద గట్టిగా చెప్పారు. మహిళా వేధింపుల విషయంలో ఇండస్ట్రీ అంతా కలిసి కొన్ని రూల్స్ పెట్టుకుందామా అనుకుంటే, ఇండస్ట్రీ వారు తాము ప్రత్యేక గ్రహానికి చెందిన వారమని, గ్రహాంతరవాసులమనే ఆలోచనతో ఉన్నారని విమర్శించారు.
సామాన్య కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర ప్రొఫెషన్స్‌లోకి పంపించినంత ధైర్యంగా సినీ పరిశ్రమకు పంపించే పరిస్థితులు రావాలని, అప్పుడే ఈ ఇండస్ట్రీపై నమ్మకం పెరుగుతుందని నేరెళ్ల శారద తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications