Holiday: 13 రోజులు సెలవులు.. ఎంజాయ్ చేయండి ఇక..!
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ, దసరాను నిర్వహిస్తుంటారు. పువ్వులను కొలిచే పండగ బతుకమ్మ కోసం ఆడ బిడ్డలు ఎంతగానో ఎదురు చూస్తారు. మగ పిల్లలు అక్కచెల్లెళ్ల కోసం అడవికి వెళ్లి తగ్గేడు, గునుగు పువ్వులు తీసుకొస్తారు. ఆడ బిడ్డలు ఆ పువ్వులతో బతుకమ్మను పేర్చి సాయంత్రం బతుకమ్మ ఆడతారు. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. 9వ రోజు పెద్ద బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. సద్దుల బతుకమ్మ రోజు పిల్లలు, పెద్దలు వేడుకల్లో పాల్గొంటారు.
బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆడబిడ్డల అందరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. బతుకమ్మ ఆడుకోవడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా సెలవులను ప్రకటించింది. ఈసారి పాఠశాలలకు 13 రోజులు హాలీడేస్ ప్రకటించారు. ఎంగిలి పూల రోజు అంటే అక్టోబర్ 2న సెలవులు మొదలవుతాయి. అక్టోబర్ 15న తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయి. బుధవారం నుంచి పిల్లలకు సెలవులు ప్రకటించారు.

దీంతో పిల్లలు ఎక్కడి వెళ్లాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు హాస్టళ్లలో ఉన్న పిల్లలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. బుధవారం నుంచి సెలవులు ఉండడంతో చాలా పాఠశాలలు సోమవారం బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహించాయి. కొన్ని పాఠశాలలు మంగళవారం సెలబ్రెషన్స్ చేస్తున్నాయి. ఇక ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ నుంచి సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. తిరిగి అక్టోబర్ 14న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.












Click it and Unblock the Notifications