దాసరి అరుణ్ కుమార్ ఇంట్లో చోరీ: డ్రైవర్ పనే
హైదరాబాద్: ప్రముఖ దర్శకనిర్మాత దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడింది కారు డ్రైవరేనని తేల్చారు. అతడ్ని ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకటరెడ్డి, crఐ ముత్తుతో కలిసి వివరాలు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవి పల్లికి చెందిన నల్లమట్టి అచ్చంగారి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(30) జూబ్లీహిల్స్ రోడ్ నెం 72లో నివాసముండే దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ ఇటీవల మద్యానికి అలవాటు పడటంతో పాటు చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు తనకు వచ్చే జీతం సరిపోకపోవడంతో తాను పనిచేస్తున్న ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇందులో భాగంగా అరుణ్‌కుమార్ ఇంటి డూప్లికేట్ తాళాలతో లోపలికి ప్రవేశించి..అల్మారాలో ఉన్న రూ.2 లక్షల నగదు, రూ. 3న్నర లక్షల రోలెక్స్ వాచ్, రూ. లక్షన్నర విలువ చేసే రాడర్ వాచ్, రెండు ఉంగరాలు, సెల్‌ఫోన్ అపహరించాడు.
అనంతరం యథావిధిగా తలుపులు మూసి వెళ్లిపోయాడు. విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన అరుణ్‌కుమార్ కుటుంబసభ్యులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను ప్రశ్నించారు.
డ్రైవర్‌ను కూడా తమ దైన శైలిలో విచారణ చేయగా అతను చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతన్ని అరెస్టు చేసి రూ.60 వేల నగదును, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదును అప్పులు తీర్చేందుకు వాడుకున్నానని నిందితుడు తెలిపాడు.












Click it and Unblock the Notifications