సోదరుడిని తలుచుకొని బోరుమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
టీఆర్ఎస్ నేత, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శనివారం తన సోదరుడిని తలచుకొని బోరున విలపించారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసేందుకు కుడా చైర్మన్ యాదవ రెడ్డి,
సిద్దిపేట: టీఆర్ఎస్ నేత, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శనివారం తన సోదరుడిని తలచుకొని బోరున విలపించారు.
సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసేందుకు కుడా చైర్మన్ యాదవ రెడ్డి, వరంగల్‌కు చెందిన అధికారులతో సిద్దిపేట వచ్చారు.

ఈ సమయంలో శ్రీరామకుంట శ్మశానవాటికను ఆధునికీకరించి, వైకుంఠధామంగా తీర్చిదిద్దిన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మృతి వనంలో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా తన సోదరుడు దాస్యం ప్రణయ్ భాస్కర్‌కు జ్ఞాపకంగా మొక్కను నాటి తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. పక్కనే ఉన్న మంత్రి హరీష్ రావు ఆయనను ఓదార్చారు.












Click it and Unblock the Notifications