Liquor Sales: నెల రోజుల్లో రూ. 4 వేల 274 కోట్ల మద్యం అమ్మకాలు..
తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. 2023 కు సంబంధించి డిసెంబర్ లో భారీగా లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గత 31 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 4 వేల 274 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో భారీగా లిక్కర్ విక్రయం జరిగింది. డిసెంబర్ 29వ తేదీ 180 కోట్లు విలువైన మద్యాన్ని విక్రయించగా.. డిసెంబర్ 30వ తేదీ 313 కోట్లు.. డిసెంబర్ 31వ తేదీ 127 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ ను విక్రయించారు. ఈ మూడు రోజుల్లోనే రూ.620 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
ఈ సంవత్సరం కూడా తెలంగాణలో మందు బాబులు రికార్డు స్థాయిలో లిక్కర్ తాగారు. 2023 డిసెంబర్ 31 నాడు అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచిందేకు ప్రభుత్వం అనుమతివ్వడంతో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి 1,30,000 కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్లు అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ నెలలోనే 4 వేల 274 కోట్ల రూపాయిల లిక్కర్ అమ్మకాలు జరిగాయి.

గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది ఓవరాల్ గా 26 శాతం మేరకు మద్యం అమ్మకాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక లిక్కర్ 33 శాతం మేర సేల్ పెరుగగా.. బీరు 16 శాతం పెరిగింది. మందు తోపాటు కూల్ డ్రిక్స్ కూడా భారీగా అమ్ముడుపోయాయి. చాలా మంది లిక్కర్ కూల్ డ్రిక్స్ కలిపి తాగుతారు. అలాగే మహిళలు, మద్యం తాగాని పుషులు కూడా కూల్ డ్రింక్స్ తాగడంతో వారి విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. అయితే లిక్కర్, కూల్ డ్రిక్స్ కంటే తాజా జ్యూస్ లు, మందు కలపని కల్లు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
లిక్కర్, కూల్ డ్రింక్స్ తో పాటు మటన్, చికెన్, చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయి. ఇక తెలంగాణలో ఇప్పుడొచ్చిన ప్రభుత్వం బెల్ట్ షాపులను మూయిస్తామని చెబుతోంది. బెల్ట్ షాపులు మూయిస్తే మద్యం విక్రయాలు తగ్గే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications