నిరుద్యోగులకు డీట్.. సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త!!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ కొత్తగా ఏఐ ఆధారిత డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్
దీని ద్వారా నిరుద్యోగులకు మరియు సదరు కంపెనీలకు మధ్య వారధిగా ఉండి ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఉద్యోగాల కోసం తెలంగాణ ఐటి శాఖ తీసుకున్న కీలక నిర్ణయంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాల కల్పన చేసేందుకు ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఉద్యోగావకాశాలు, స్కిల్ ప్రోగ్రామ్స్ తో పాటు అన్నీ ఒకేచోట
డిజిటల్ ప్లాట్ ఫామ్ లో డీట్ కి సంబంధించి ప్రత్యేక యాప్ ను రూపొందించిన ప్రభుత్వం వివిధ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను అలాగే అప్రెంటీస్ షిప్, ఇంటర్న్ షిప్ తదితర వివరాలను ఈ పోర్టల్ లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతారు. వివిధ కంపెనీల అవసరాలకు తగ్గట్టు సమయానుకూల వాస్తవ సందేశాలను దీని ద్వారా తెలియజేస్తారు.
ఎప్పటికప్పుడు ఉద్యోగాల సమాచారం
నిరుద్యోగులతో పాటు ఫైనల్ ఇయర్ లో ఉన్న విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఇందులో నమోదు చేసుకోవడం ద్వారా సులభంగా తమకు తగిన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగిన ఉపాధి అవకాశాలకు సంబంధించి మెసేజెస్, ఈమెయిల్స్ పంపించడంతో పాటు కాల్స్ కూడా చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధిగా డీట్
అభ్యర్థులు ఇచ్చే వివరాలతో ఈ పోర్టల్ లో నమోదు చేసుకొని నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి మద్దతునిస్తుంది.ఈ పోర్టల్ ద్వారా ఇటు ఉద్యోగాలు కోరుకునే వారికి మాత్రమే కాకుండా, ఉద్యోగాలు ఇచ్చే వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది. మెరుగైన స్కిల్స్ ఉన్నవారిని ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు వెసులుబాటు దొరుకుతుంది. డీట్ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. దీనిని డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగం కోసం సైన్ ఇన్ అవ్వాలి .
రేవంత్ సర్కార్ నిరుద్యోగుల కోసం సంచలన నిర్ణయం
అందులో ఇచ్చిన వివరాలను పూర్తిచేసి సైన్ ఇన్ చేసి అందులో వారు అడిగిన ప్రొఫైల్ డేటాను పూరించి దరఖాస్తులను సమర్పించుకోవాలి. యాప్ లో లాగిన్ అయిన తర్వాత మీరు చెయ్యగలిగిన ఉద్యోగాలను సెర్చ్ లో అన్వేషించాలి. అంతేకాదు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా తీసుకోవచ్చు. ఇక రేవంత్ సర్కార్ నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిన ఈ యాప్ వారికి అన్ని విధాలుగా ప్రయోజనం కలిగిస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications