ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమలుపు; తెరపైకి కొత్తపేరు; ఎవరీ మేక శరణ్?

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తుంది. తాజాగా మేక శరణ్ పేరు లిక్కర్ స్కామ్ లో వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరి మేక శరణ్ ?కవితకు ఇతనికి సంబంధం ఏమిటి? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముడుపుల వ్యవహారంలో ఇతను పోషించిన పాత్ర ఏమిటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మేక శరణ్ ..కవిత ఆడబిడ్డ కొడుకు.. కవిత మేనల్లుడు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇతను కూడా కీలక భూమిక పోషించినట్టుగా తాజాగా ఈడీ వెల్లడించింది. ఇటీవల ఈడి అధికారులు కవిత ఇంట్లో దాడులు చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నారు. అప్పుడు మేక శరణ్ ఫోన్ ని కూడా సీజ్ చేశారు ఈడీ అధికారులు.

Delhi Liquor Scam ED inquires kavitha about Meka sharan Who is Meka Saran

దీంతో అతని ఫోన్లో సౌత్ గ్రూప్ కి సంబంధించిన లావాదేవీల వ్యవహారంపై చాటింగ్ ను గుర్తించిన ఈడీ అధికారులు ఈ స్కామ్ లో అతని పాత్ర గురించి దర్యాప్తు చేస్తున్నారు.నిన్న కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు మేక శరణ్ గురించి ప్రదేపదే ప్రస్తావించడం, అతని ఆర్థిక లావాదేవీలపై, అతను నిర్వహించే వ్యాపారాలపై ప్రశ్నించడం జరిగిందని సమాచారం.

మొన్నటికి మొన్న కవితను మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరిన క్రమంలో కూడా రౌస్ అవెన్యూకోర్టులో ఈడీ అధికారులు కవితను మేక శరణ్ కు సంబంధించిన సమాచారాన్ని అడిగినట్టు పేర్కొన్నారు. మేక శరణ్ కు సమీర్ మహేంద్రు కు కూడా సంబంధాలు ఉన్నాయని గుర్తించిన ఈడీ అధికారులు సమీర్ మహేంద్రును మరో మారు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని గుర్తించడంతో తాజాగా ఈడి అధికారులు కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు చేశారు. అఖిల కుమారుడు మేక శరణ్ ను ఏ సమయంలోనైనా ఈడి అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో అప్రూవర్లు గా మారిన సౌత్ సంస్థలో ఉన్న కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులును కూడా మరోమారు మేక శరణ్ గురించి విచారించనున్నట్టు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+