డిప్రెషన్‌తో మహిళా టెక్కీ ఆత్మహత్య, చావుకు ఎవరూ కారణం కాదని..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

ఏపీలోని గుంటూరుకు చెందిన కోమలికి భాస్కర రావుతో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. కెపిహెచ్‌బి కాలనీ మూడవ ఫేజ్‌లో ఉంటున్నారు.

కోమలి ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తోంది. భాస్కర రావు ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నారు. బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భాస్కర రావుకు లోపలి నుంచి గడియ పెట్టి కనిపించింది.

Depressed woman techie ends his life

దీంతో ఆయన కోమలిని పిలిచాడు. ఎంతకూ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూశాడు. కోమలి సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు తలుపులు తీసి ఆమెను కిందకు దించారు. అక్కడ పోలీసులు ఓ సూసైడ్ నోట్‌ను గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, తాను డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు రాసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police said that Woman techie Komala was found hanging on the ceiling fan at the home in Hyderabad.
Please Wait while comments are loading...