వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి జోక్యం ఏమిటి: రోహిత్ ఆత్మహత్యపై డెరెక్ ఒబ్రెయిన్ ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ మద్దతు పలికారు. రోహిత్‌ది ఆత్మహత్య కాదని, అది హత్యేనని ఆయన అన్నారు.

యూనివర్శిటీ యాజమాన్యం దళితులను వేధింపులకు గురిచేసిందని ఆయన ఆరోపించారు. తనతో చర్చకు రావాలంటూ ఏబీవీపీ నేతలకు ఒబ్రెయిన్‌ సవాల్‌ విసిరారు. సోషల్‌ మీడియాలో బీజేపీ కార్యకర్తలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విశ్వవిద్యాలయం విషయంలో మంత్రి జోక్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Derek O'brein challanges ABVP leaders on Rohith suicide

బుధవారం హెచ్‌సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం డెరెక్‌ ఒబ్రెయిన్‌ మీడియాతో మాట్లాడారు. ఐదుగురు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని చెప్పారని, చాలా మంచిదని అన్నారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఇది ఎస్సీ, ఎస్టీల సమస్య కాదని, ఇది జాతీయ సమస్య అని, అసహనానికి సంబంధించిన వ్యవహారమని అన్నారు. ఇందులో వీసీ పాత్ర ఉందని ఆయన విమర్శించారు. వర్సిటీ వ్యవహారాల్లో మంత్రి ఎందుకు జోక్యం చేసుకున్నారని? లేఖలు ఎందుకు రాశారని డెరెక్‌ ఒబ్రెయిన్‌ ప్రశ్నించారు.

English summary
Trinamool Congress leader Derek O'brein challenged ABVP students on Hyderabad central University research student Rohith's suicide incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X