వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకం ప్రకారమే నయీం ఎన్ కౌంటర్: మీడియాకు డీజీపీ ప్రకటన

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం ఉదయం జరిగిన నయీం ఎన్‌కౌంటర్ ఘటనపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. సోమవారం ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన అందులో ఎన్‌కౌంటర్ జరిగిన తీరును వెల్లడించారు.

పక్కా సమాచారంతోనే గ్యాంగ్ స్టర్ నయీం ఇంటిని గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం తన అనుచరులతో కలిసి షాద్ నగర్ చేరుకున్నాడని ఆయన అందులో తెలిపారు. తానుంటున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టిన విషయాన్ని పసిగట్టిన నయీం అప్రమత్తమయ్యాడని తెలిపారు.

మిలీనియం టౌన్ షిప్‌లోని ఇంటిని పోలీసులు చుట్టుముట్టినప్పుడు నయీం గన్‌మెన్ ముందుగా కాల్పులు జరిపాడని తెలిపారు. ఈ కాల్పుల నుంచి రక్షించుకునేందుకు గ్రేహౌండ్స్ పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని ఆయన తెలిపారు. ఈ కాల్పుల్లో నయీం చనిపోయాడని డీజీపీ పేర్కొన్నారు.

 పథకం ప్రకారమే నయీంను లేపేశారు: మీడియాకు డీజీపీ ప్రకటన

పథకం ప్రకారమే నయీంను లేపేశారు: మీడియాకు డీజీపీ ప్రకటన

అయితే నయీంతో పాటు ఎవరైనా హతమయ్యారా, ఎవరైనా అరెస్ట్ చేశారా అనే విషయాలు వెంటనే వెల్లడి కాలేదు. నయీం ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ కాసేపట్లో వెల్లడించే అవకాశముంది. నయీం గ్యాంగ్‌కు చెందిన పలువురు ఇటీవలే పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.

పథకం ప్రకారమే నయీంను లేపేశారు: మీడియాకు డీజీపీ ప్రకటన

పథకం ప్రకారమే నయీంను లేపేశారు: మీడియాకు డీజీపీ ప్రకటన

నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం నేర చరిత్ర చాలా పెద్దదే. ఉమ్మడి రాష్ట్రంలో పెను కలకలం సృష్టించిన సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసుతో పాటు పటోళ్ల గోదర్ధన్ రెడ్డి, మావోయిస్టు నేతలు సాంబశివుడు, రాములు హత్య కేసుల్లోనూ నయీమ్ కీలక నిందితుడిగా ఉన్నాడు.

 పథకం ప్రకారమే నయీంను లేపేశారు: మీడియాకు డీజీపీ ప్రకటన

పథకం ప్రకారమే నయీంను లేపేశారు: మీడియాకు డీజీపీ ప్రకటన

భూదందాలు, సెటిల్ మెంట్లతో తనదైన శైలిలో కరుడుగట్టిన నేరగాడిగా పేరుగాంచిన నయీంపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం అతడిని పట్టుకునేందుకు పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పథకం ప్రకారమే నయీంను లేపేశారు: మీడియాకు డీజీపీ ప్రకటన

పథకం ప్రకారమే నయీంను లేపేశారు: మీడియాకు డీజీపీ ప్రకటన

దీంతో రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ పోలీసులు షాద్‌నగర్‌లో అతడిని అంతమొందించాయి. మొత్తం 20 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నయీంపై 100కు పైగా కేసులున్నాయి.

English summary
Telangana Dgp anurag sharma on mohammad nayeem uddin encounter at shad nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X