కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టం; కేసీఆర్ వ్యూహాలకు ప్రజామోదం: ఉగాది పంచాంగం!!

తెలుగువారి తొలి పండుగ, ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కడుతూ జరుపుకునే పండుగ ఉగాది పండుగ ఈరోజు. ఉగాది పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పంచాంగ శ్రవణ కార్యక్రమాలతో, ప్రజలంతా ఈ సంవత్సరం ఏవిధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుంటున్నారు.

తెలంగాణా భవన్ లో ఉగాది వేడుకలు
అయితే ఇదే సమయంలో రాజకీయ నాయకులు సైతం పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహించి, తమ జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నారు. ఇక తాజాగా క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేడు ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Difficult for Congress government Public support for KCR strategies Ugadi Panchangam

ఈ ఏడాది పాలక పక్షానికి కష్టమే అంటున్న పంచాంగ కర్తలు
ఈ పంచాంగ శ్రవణంలో పండితులు కేసీఆర్, కేటీఆర్ జాతకాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. క్రోధి నామ సంవత్సరంలో మంచి, చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయని, వర్షాలు సమృద్ధిగా పడి పాడిపంటలు చక్కగా పండుతాయని పంచాంగం శ్రవణం చేసిన పండితులు తెలిపారు. అయితే ఈ సంవత్సరం పాలకపక్షానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత కష్టాలు కనిపిస్తున్నాయని, ప్రతిపక్షాలు కాస్త కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.

కేసీఆర్ కు ఏం చేసినా విజయం వరిస్తుంది
బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ది కర్కాటక రాశి అని ఆయన ఆదాయ వ్యయాలు సంతోషకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కెసిఆర్ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుందని ఆయన చేపట్టే వ్యవహారాలలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ది మకర రాశి వారి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని, ఈ ఏడాది మకర రాశి వారికి మంచి ప్రభావం కనిపించబోతుంది అని అన్నారు.

ఉగాదికి కేటీఆర్ ఆకాంక్ష
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కొత్త ఏడాదిలో అందరికీ మంచి జరగాలని, శాంతి, సౌభాగ్యం, మత సామరస్యంతో ప్రజలంతా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+