Disha case encounter : దిశ కేసులో షాకింగ్ నిజాలు.. అసలు ఎన్ కౌంటర్ చెయ్యటానికి కారణాలు ఇవేనా ?
దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ వెనుక కారణాలేంటి? పోలీసులు ఎన్కౌంటర్ తో ఊహించని విధంగా మలుపులు తిరిగిన దిశా కేసులో అసలు నిజాలు ఏంటి? పోలీసులు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు చాలానే ఉన్నాయి.. అవేంటి అన్నది తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ గా సాగుతున్న చర్చ.

బలమైన ఆధారాలు లేకనే ఎన్కౌంటర్ చేశారన్న చర్చ
దిశా కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం వెనుక ఒక ముఖ్యమైన కోణాన్ని న్యాయ నిపుణులు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే ఎన్కౌంటర్ జరగకపోతే దిశ కేసులో నిందితులే నేరం చేసినట్లుగా నిరూపించడానికి తగిన ఆధారాలు లేవు. దీంతో నిందితులకు కోర్టులో శిక్ష పడే అవకాశం తక్కువగా ఉండటం వల్ల పోలీసులు ఈ చర్యకు పాల్పడి ఉంటారనేది న్యాయ నిపుణుల అంచనా.

దిశాను దహనం చెయ్యటం , ప్రత్యక్ష సాక్షులు లేకపోవటం కారణం
ఎక్కడైన నేరం జరిగినప్పుడు నేరానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఉండాలి. వారు ఆ నేరం చూసినట్లుగా కోర్టు ముందు చెప్పగలిగేలా ఉండాలి. కానీ దిశ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేరు. వారి నేరం చేశారని చెప్పడానికి, నిరూపించడానికి కావలసిన బలమైన ఆధారాలు లేవు. శరీరం పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో డీఎన్ఏ పరీక్ష చేయడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి. తామే నేరం చేశామని చెప్పినప్పటికీ నిందితుల వాంగ్మూలానికి కోర్టులో విలువ ఉండదు.

కోర్టుకు వెళితే శిక్ష పడే ఛాన్సులు చాలా తక్కువనే ఈ నిర్ణయమా?
ఇక అక్కడ నిందితులు తమను బలవంతంగా పోలీసుల చెప్పమన్నారు అని, బెదిరించారని చెప్పే అవకాశం ఉంటుంది .ఇక ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని, ఈ కేసులో నిందితులు చేసిన నేరాన్ని నిరూపించడానికి సాధ్యం కాని పరిస్థితి. దాదాపు బలమైన సాక్ష్యాలు సేకరించటానికి అన్ని విధాలా ప్రయత్నం చేసిన పోలీసులు అది సాధ్యం కాక చివరకు నేరస్తులు తప్పించుకునే ప్రమాదం వుంది అది సమాజంలో ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది అని అలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని తెలుస్తుంది. అందుకే ఎన్కౌంటర్ చేసి దిశ హతమార్చినట్లు గా చర్చ జరుగుతుంది.

కరడుగట్టిన నేరస్తుల్లా సాక్షాలు లేకుండా చేసిన నిందితులు
ఇక దిశ సామూహిక అత్యాచార, హత్య ఘటనను పోలీసులు ఏవిధంగానూ నిరూపించ లేనంతగా పక్కా ప్లాన్ తో నిందితులు వ్యవహరించారు. దిశను సజీవ దహనం చేసి, పోలీసులకు కావలసిన కీలక ఆధారాలను రూపుమాపారు. పక్కా క్రిమినల్స్ లాగా, కరడుగట్టిన నేరస్తులలాగా అన్ని విషయాల్లో తెలివిగా ప్రవర్తించారు . దిశ సోదరికి చేసిన ఫోన్ కాల్ వల్ల వీళ్ళను పట్టుకోగలిగారు కానీ లేకుంటే వీరిని పట్టుకోవటమే కష్టంగా ఉండేది.

నేరం నిరూపించే ఆధారాలు బలహీనంగా ఉండటమే అసలు కారణం
ఇక వీరిని అరెస్ట్ చేసినా వీరే నేరస్థులు అని నిరూపించడానికి కోర్టులో దాఖలు చేయడానికి కావలసిన ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి.దీంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి కేసుల్లో తెలంగాణ పోలీసులు స్పందించిన తీరును దేశం మొత్తం కొనియాడుతోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications