చావు బతుకుల మధ్య దిశా కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి
స్వయంకృత అపరాధం ఆ కుటుంబంలో కొడుకును కడతేరిస్తే , రోడ్డు ప్రమాదం తండ్రిని చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడేలా చేసింది.దిశ ఘటన యావత్ భారత దేశాన్ని కదిలించింది. షాద్ నగర్ వద్ద దిశను సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అందర్నీ షాక్ కు గురి చేసింది .
ఈ ఘటన జరిగిన తర్వాత దిశా హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. మొన్నటి వరకు వారి మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలోనే ఉండగా ఇటీవలే వారి మృతదేహాలను ఖననం చేశారు. ముఖ్యంగా నిందితుల కుటుంబ సభ్యుల్లో చెన్నకేశవులు భార్య గర్భవతి కావటం , ఆమె తన భర్తతో పాటే తనను చంపెయ్యమని ఆందోళన చెయ్యటం చర్చనీయాంశం అయ్యింది. ఇక ఇదే కుటుంబాన్ని ఇప్పుడు మరో విషాదకర సంఘటన కలచివేస్తుంది.

దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య ఈ రోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నారాయణ పేట్ జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య ప్రయాణిస్తున్న బైక్ ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో కూర్మయ్య కు తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య అలియాస్ కూర్మప్ప తన స్వగ్రామమైన గుడిగుండ్ల నుంచి బండిపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కూర్మయ్యను తొలుత మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఈ ప్రమాదం తరువాత సదరు పోలీసు అధికారిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేశారన్న సెక్షన్ పై కేసు నమోదు చేశారు. ఓ వైపు కొడుకు చావు మరిచి పోకముందే తండ్రి చావు బతుకుల మధ్యన ఉండడం ఆ కుటుంబాన్ని విషాదంలో మునిగిపోయేలా చేసింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications