Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ నోట పాక్ మంత్రి మాటలా?: భారతీయుడివేనా అంటూ ఏకిపారేసిన డీకే అరుణ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు సాక్షాలు కావాలా? అసలు నువ్వు భారతీయుడివా? అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ.

శత్రు దేశాలకు బలం చేకూరుస్తున్న కేసీఆర్ మాటలు: డీకే అరుణ

శత్రు దేశాలకు బలం చేకూరుస్తున్న కేసీఆర్ మాటలు: డీకే అరుణ

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ సరిహద్దుల గురించి మాట్లాడిన తీరును డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. జాతీయ మీడియాలో ప్రచారం కోసం భారత ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఎన్నికల సమయంలో సరిహద్దుల్లో అలజడులు రేగుతున్నాయని కేసీఆర్ ప్రకటించడం శత్రు దేశాల వాదనకు బలం చేకూర్చడమే అవుతుందని మండిపడ్డారు. భారత ఆర్మీ ఛీఫ్ , వాయుసేన ఛీఫ్ సర్జికల్ స్ట్రైక్ పై ప్రకటన విడుదల చేశాక ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు.

కేసీఆర్ నోట పాక్ మంత్రి మాటలా?: డీకే అరుణ ఫైర్

కేసీఆర్ నోట పాక్ మంత్రి మాటలా?: డీకే అరుణ ఫైర్

ఒక రాష్ట్రానికి బాధ్యతాయుతమయిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి పాకిస్థాన్ మంత్రి అడిగినట్లుగా సర్జికల్ స్ట్రైక్ కు సాక్ష్యాధారాలు అడగడం కేసీఆర్ దిగజారుడు రాజకీయమే అవుతుందని డీకే అరుణ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో పొత్తుకోసం, జాతీయ స్థాయిలో చిన్న స్థానం కోసం రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మద్దతుగా ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా మాట్లాడడం టీఆర్ఎస్, కేసీఆర్ థర్డ్ క్లాస్ మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు డీకే అరుణ.

జాతీయ జెండా నీకు బీజేపీ జెండలా కనిపించిందా.. కేసీఆర్?

జాతీయ జెండా నీకు బీజేపీ జెండలా కనిపించిందా.. కేసీఆర్?

దివంగత సీడీఎస్ బిపిన్ రావత్‌పై ఈరోజు కపట ప్రేమ చూపెడుతున్న కేసీఆర్.. కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ రావత్‌ని అసభ్యంగా దూషించినప్పుడు ఎందుకు ప్రగతి భవన్‌లో నిశ్శబ్దంగా ఉన్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం గోబెల్స్ ప్రచారాలు చేస్తున్న కేసీఆర్ కళ్ళకు బిపిన్ రావత్ పార్థివ దేహన్ని తమిళ నాడు నుంచి తరలిస్తుండగా తమిళ ప్రజలు జాతీయ జెండాను చేతపట్టుకుని రహదారుల వెంట నివాళులు అర్పించిన సంగతి కనిపించలేదా ? జాతీయ జెండా నీకు బీజేపీ జెండాగా కనిపించిందా? అంటూ కేసీఆర్‌పై డీకే అరుణ ధ్వజమెత్తారు.

కేసీఆర్.. పిచ్చిప్రేలాపనలే నీ పతనానికి నాంది: డీకే అరుణ

కేసీఆర్.. పిచ్చిప్రేలాపనలే నీ పతనానికి నాంది: డీకే అరుణ

కొత్త రాజకీయ పార్టీ పెట్టుకో, లేకుంటే కొత్త ఫ్రంటో, టెంటో పెట్టుకో కానీ దేశ భద్రతను తాకట్టుపెట్టేలా.. పాకిస్థాన్ ప్రకటనలకు బలం చేకూర్చేలా, భారత ప్రభుత్వంను అబాసుపాలు చేసేలా ఇంకోసారి మాట్లాడితే నీకు తగిన శాస్తి చేస్తామని డీకే అరుణ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న బీజేపీని తట్టుకోలేక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు నెరవేర్చలేక రోజుకో వేషం వేస్తూ రాజ్యాంగం గురించి, భారత సైన్యం గురించి ఇష్టారీతిన మాట్లాడటం నీ పతనానికి నాంది అన్నారు.

నీ పిచ్చి ప్రేలాపనలతో, బీజేపీ కార్యకర్తలపై దాడులతో అధికారాన్ని కాపాడుకుంటానని భావించడం నీ అవివేకమే అవుతుందని కేసీఆర్‌ను ఉద్దేశించి డీకే అరుణ తీవ్రంగా స్పందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+