సిగ్గుందా: కేటీఆర్‌పై డీకే అరుణ తిట్ల వర్షం, రూ.150 కోట్లంటూ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu
  Bathukamma Sarees scheme : సిగ్గుందా: KTR పై తిట్ల వర్షం, బతుకమ్మ చీరల ఎఫెక్ట్ | Oneindia Telugu

  హైదరాబాద్: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం తిట్ల వర్షం కురిపించారు. ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

  చీరల దెబ్బ: దిగొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం! 'మేం చేసేవాళ్లంగా'

  కెటిఆర్ సిగ్గులేకుండా

  కెటిఆర్ సిగ్గులేకుండా

  చీరల నాణ్యత గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పైన కెటిఆర్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని డికె అరుణ విమర్శించారు. కాంగ్రెస్ నిరసనలు చేయించిందని కెటిఆర్ సిగ్గులేకుండా మాట్లాడారన్నారు. బతకమ్మ చీరల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటే, ప్రతి పక్షాలు ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు.

  చీరల గురించి కేటీఆర్‌కు ఏం తెలుసు?

  చీరల గురించి కేటీఆర్‌కు ఏం తెలుసు?

  అయినా చీరల గురించి కేటీఆర్‌కు ఏం తెలుసునని అరుణ ప్రశ్నించారు. మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని అరుణ అన్నారు. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయిని, మహిళలు నిరసన తెలపడం తప్పా? మహిళలే నిరాశకు గురై స్వచ్చందంగా నిరసన తెలిపారన్నారు.

  చేనేత చీరలని ప్రచారం చేసుకుంది నిజం కాదా

  చేనేత చీరలని ప్రచారం చేసుకుంది నిజం కాదా

  బతుకమ్మ చీరల నాణ్యతను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇవి చేనేత చీరలని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది నిజం కాదా అని నిలదీశారు. ప్రజల ఆగ్రహాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పైన విమర్శలు విడ్డూరమన్నారు.

  రూ.150 కోట్లు మింగేశారని సంచలనం

  రూ.150 కోట్లు మింగేశారని సంచలనం

  బతుకమ్మ చీరల స్కామ్‌లో 150 కోట్లు మింగేశారని డికె అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చీరల పేరుతో టిఆర్ఎస్ ఎన్నికల జిమ్మిక్కుకు పాల్పడిందన్నారు. చీరలు కాల్చారని మహిళల పైన కేసులు పెట్టడం సరికాదన్నారు. తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. మహిళలను కేసుల పేరుతో భయపెడితే సహించేదిలేదన్నారు.

  ఊరుకునేది లేదు

  ఊరుకునేది లేదు

  నాసిరకం బతుకమ్మ చీరలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డికె అరుణ హితవు పలికారు. అంత మేరకు మహిళల అక్కౌంట్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. నాణ్యత కల్గిన చీరలు ఇవ్వాలని కాంగ్రెస్ చెబుతోందని, .ప్రజల సొమ్ము దోచుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్నారు.

  కెసీఆర్ ఎముగలు కూడా వదలడం లేదు

  కెసీఆర్ ఎముగలు కూడా వదలడం లేదు

  ఆంధ్రా నాయకులు తోలు మింగితే, ఇప్పుడు కేసీఆర్ ఎముకలను కూడా వదలడం లేదని డికె అరుణ నిప్పులు చెరిగారు. మహిళలను అగౌరవ పరిచిన టిఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు పాతరేస్తారన్నారు. ఎంపి కవిత ఇదే బతుకమ్మ చీర కట్టుకుని బతుకమ్మ ఆడుతారా అని ప్రశ్నించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress MLA DK Aruna lashed out at Chief Minister K Chandrasekhar Rao and Minister KT Rama Rao for saree scheme.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X