ktr సర్... త్వరగా కోలుకోవాలంటే ''డీజే టిల్లు'' సినిమా చూడండి!! వైద్యులు సూచించారు!!
కాలికి గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(ktr)కు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ పార్టీ అభిమానులు, కార్యకర్తలతోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు. కాలికి గాయం కావడంతో వైద్యులు మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోమన్నారని, మంచి సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటే చెప్పాలంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కోరిన సంగతి తెలిసిందే. దీనికి రిప్లైగా నెటిజన్లు పలు సినిమాలను, వెబ్ సిరీస్ లను చూడాలంటూ సూచిస్తున్నారు.

''డీజే టిల్లు'' చూడండి.. 'ఆహా'
ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఆయన త్వరగా కోలుకోవాలంటే ''డీజే టిల్లు'' సినిమా చూడాలని వైద్యులు సూచించారంటూ ట్వీట్ చేసింది. దీంతోపాటు కథానాయకుడు బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్, ప్రియమణి 'భామాకలాపం', అమలాపాల్ నటించిన 'కుడి ఎడమైతే' కూడా చూడాలని, వాటిని మిస్ కావొద్దని సూచించింది.

చూస్తుంటే.. చూస్తూనే ఉండిపోతారు
అలాగే జీ5 కూడా కొన్ని సినిమాలు, సిరీస్ లు సూచించింది. ''గుడ్ మార్నింగ్ కేటీఆర్ గారూ.. 'మా నీళ్ల ట్యాంకు' తో ప్రారంభించి 'రెక్కీ' తో థ్రిల్ అవుతూ, లంచ్ టైమ్ కు కుటుంబం మొత్తం 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'ని కంప్లీట్ చేసి రాత్రికి rrr చూసేయమని సూచించింది. త్వరగా కోలుకుంటారని, కానీ ఒక్క విషయం మాత్రం జాగ్రత్త అని... ''చూస్తూనే ఉండిపోతారు'' అంటూ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసింది.

మూడువారాల విశ్రాంతి అవసరం
అంతకుముందు కూడా నెటిజన్లు కొన్ని సూచనలు చేశారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' వీక్షించమని ఓ నెటిజన్ కోరారు. పంచాయత్ చూడాలని మరొకరు. మౌస్, కింగ్ డం సీజన్ 12, కొరియన్ సిరీస్ ల పేర్లు మరొకరు చెప్పారు. అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్, మనీ హైస్ట్, ది బాయ్స్, డార్క్, రాకెట్ బాయ్స్ తదితర షోలు సూచించారు. కాలికి గాయం కావడంతో మూడువారాల విశ్రాంతి అవసరమని వైద్యలు కేటీఆర్ కు సూచించారు.












Click it and Unblock the Notifications