శశికుమార్ ఫ్రెండ్ మాత్రమే, ఏ సంబంధమూ లేదు: చంద్రకళ
హైదరాబాద్: డాక్టర్ శశికుమార్ తనకు మిత్రుడు మాత్రమేనని, ఇతరేతర వ్యవహారాలతో తనకు సంబంధం లేదని చంద్రకళ చెప్పారు. హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌లో జరిగిన డాక్టర్ల తుపాకి కాల్పులు, శశికుమార్ ఆత్మహత్య కేసుల విషయంపై పోలీసులు శుక్రవారం ఆమెను ప్రశ్నించారు.
మహిళా పోలీసులు ఆమె ఇంట్లోనే రెండు గంటల పాటు ప్రశ్నించారు. శశికుమార్‌తో 2012 నుంచి పరిచయం ఉందని ఆమె చెప్పారు. డిప్రెషన్‌లో ఉన్నాను, ఓ రోజు ఫామ్‌హౌస్‌లో ఉంటానంటే తాను దించి వచ్చానని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

శశికుమార్ ఆర్థిక లావాదేవీలతో గానీ ఆస్పత్రి వ్యవహారాలతో గానీ తనకు ఏ విధమైన సంబంధం లేదని చంద్రకళ చెప్పారు. చంద్రకళను పోలీసులు విచారించడం ఇది రెండోసారి. హిమాయత్‌నగర్‌లో డాక్టర్ ఉదయ కుమార్‌పై కాల్పులు జరిపిన తర్వాత శశికుమార్ చంద్రకళ ఇంటికి వెళ్లినట్లు, ఆ తర్వాత అతన్ని చంద్రకళ తన ఫామ్‌హౌస్‌లో కారులో తీసుకుని వెళ్లి దించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
చంద్రకళకు చెందిన ఫామ్‌హౌస్‌లో డాక్టర్ శశికుమార్ మరణించాడు. అతను రివాల్వర్‌తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు చంద్రకళను విచారించారు.












Click it and Unblock the Notifications