ఇంట్లో ఇల్లాలు..దవాఖానాలో ప్రియురాలు: నర్సుతో డాక్టర్ అక్రమసంబంధం.. చిత్రహింసలు
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఏకంగా కాపురాలకే ఎసరు పెడుతున్నాయి. అక్రమ సంబంధాలతో భార్యా భర్తలు విడిపోయి పండంటి కాపురంను కూల్చుకుంటున్నారు. ఫలితంగా పిల్లలు అనాథలవుతున్నారు. అక్రమ సంబంధాల వల్ల ప్రాణాలు తీసుకున్న ఘటనలు చూశాం.. ప్రాణాలు తీసిన ఘటనలు చూశాం.అక్రమ సంబంధాలపై ప్రతి రోజు వార్తా పత్రికల్లో కథనాలు వస్తున్నా... టీవీల్లో వార్తలు చూస్తున్నా చాలామందిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. యదేచ్చగా సంబంధాలు నెరుపుతున్నారు. ఏదో ఒకరోజు బయటపడగానే కాపురాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా సూర్యాపేటలో ఓ అక్రమ సంబంధం వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.
సూర్యాపేటలో నివసిస్తున్న దంపలు ఇద్దరూ డాక్టర్లు. వారు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ అయిన తన భర్తపై డాక్టరైన భార్యకు అనుమానం వచ్చింది. తను హాస్పిటల్‌లో పనిచేసే నర్సులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమో అన్న అనుమానం బలంగా నాటుకుపోయింది వైద్యురాలికి. ఈ క్రమంలోనే ఓ నర్సుపై అనుమానం రావడంతో ఆమెను ఈ నెల 6వ తేదీన తన ఇంటికి తీసుకెళ్లింది మహిళా డాక్టర్. అక్కడ ఆ నర్సును కట్టేసి సర్జరీ బ్లేడ్స్‌తో శరీరంపై గాట్లు పెట్టి హింసించింది. తన భర్తతో మరోసారి కనిపిస్తే చంపేస్తానంటూ బెదిరించింది. ఇదంతా మరో ఇద్దరి నర్సుల సమక్షంలోనే జరిగింది.

తనకు డాక్టర్ భర్తకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ మహిళా డాక్టర్ మాట వినకుండా ఆరుగంటల పాటు నర్సుకు నరకం చూపించింది. ఆ తర్వాత తను హాస్పిటల్‌కు వెళ్లిపోవడంతో తన స్నేహితురాళ్ల సహాయంతో తప్పించుకుని స్థానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహిళా డాక్టర్‌పై ఫిర్యాదు చేసింది నర్సు. విషయం తెలిసిన డాక్టర్ భర్త ఆమెను సంప్రదించి కేసు వాపసు తీసుకోవాల్సిందిగా కోరాడు. ఇందుకు డబ్బు ఆశ చూపించాడు. అయితే డబ్బుకు లొంగని ఆ నర్సు ఫిర్యాదుతోనే ముందుకెళ్లింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications