కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు; జాగ్రత్తగా చూసుకోండి: డీకే అరుణ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యం బారిన పడి క్రమంగా కోరుకుంటున్నారని తాజాగా మంత్రి కేటీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా వైరల్ జ్వరంతో బాధపడిన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. జ్వరం తగ్గిన తర్వాత ఆయనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిందని, ఛాతిలో ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని, ఆయన కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దాదాపు మూడు వారాలుగా సీఎం కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరొక వైపు కేసీఆర్ ఆరోగ్యం గురించి మంత్రి కేటీఆర్ అప్డేట్ ఇవ్వడంతో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనదైన శైలిలో స్పందించారు.

Doubts on KCR health; KTR Take care: DK Aruna!!

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్‌లో బిజెపి నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. సీఎం కావాలన్న ఆత్రుతతో కేసీఆర్‌ను నిర్లక్ష్యం చేయవద్దని కేటీఆర్‌ను కోరారు. అలాగే, పలు ప్రభుత్వ కార్యాలయపనులు పూర్తికాకుండానే బావ బావమరుదులు తొందరపడి వాటి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మండిపడ్డారు.

గృహలక్ష్మి పథకం ఇన్నాళ్లు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని చెప్పారు. కెసిఆర్ ఆరోగ్యంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్న డీకే అరుణ మరదలు ఆదరాబాదరగా పనులు పూర్తి కాకుండా, తెల్ల సున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన లేదని, సీఎం కావాలనే ఆరాటంలోనే ఉన్నారన్నారు. దొంగ నోటిఫికేషన్లు వేసి పేపర్లను లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు.పెద్దాయనను ఫామ్ హౌస్ లో పడుకోబెట్టి నువ్వా నేనా అన్నట్టు కేటీఆర్ హరీష్ పరుగులు పెడుతున్నారని డీకే అరుణ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+