చంద్రకళని మళ్లీ విచారిస్తాం, డా.శశికుమారే వారిని పిలిచాడు: డిసిపి
హైదరాబాద్: డాక్టర్ ఉదయ్ కుమార్ పైన కాల్పులు, డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతుందని డిసిపి కమలాసన్ రెడ్డి బుధవారం నాడు చెప్పారు. ఈ రోజు చంద్రకళను విచారిస్తామని ఆయన వెల్లడించారు. ఆమెను ఓసారి విచారించామని, మరోసారి విచారిస్తామన్నారు.
డాక్టర్ ఉదయ్ కుమార్ పైన కాల్పులు జరిపింది డాక్టర్ శశికుమారేనని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని చెప్పారు. డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు. శశికుమార్ ఫాంహౌస్‌లో కాల్చుకున్నట్లు తేలిందన్నారు.
ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి విషయం వెల్లడైందని చెప్పారు. ఉదయ్ శరీరంలో తూటాలకు చెందిన కొన్ని పిల్లెట్స్ మిగిలాయని, వాటిని ఎస్ఎఫ్ఎల్ నివేదికకు పంపించామన్నారు. కాల్పుల ఘటన కేసు దర్యాఫ్తు కొనసాగుతోందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాఫ్తును ముమ్మరం చేశారు.

భాగస్వాములను శశికుమారే మాట్లాడుకునేందుకు పిలిచినట్లుగా తెలుస్తోందని వెల్లడించారు. అయితే విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. దారిలో ఉన్న బ్లూఫాక్స్ హోటల్లో కూర్చున్నారన్నారు. సాయంత్రం ఆరు గంటలకు శశికుమార్.. చంద్రకళ ఇంటికి వెళ్లారని, ఆమెనే అతనిని ఫాంహౌస్‌లో విడిచి పెట్టారన్నారు. చంద్రకళ ప్రమేయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు రాలేదన్నారు.
కాగా, తోటి వైద్యుడు ఉదయ్ కుమార్ పైన కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.
ఉదయ్ పైన కాల్పులు జరిపిన డాక్టర్ శశికుమార్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడని, ఉదయ్ చనిపోయాడని భావించాడని, ఆ భయాందోళనలోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు. మరో డాక్టర్ సాయికుమార్‌ను పోలీసులు ప్రశ్నించారు. సూసైడ్ నోట్లో పెర్కొన్న ఆరోపణల కోణంలోను పోలీసులు విచారణ జరుపుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications