ఓ చేత్తో డ్రైవింగ్.!మరో చేత్తో స్మోకింగ్.!వెనకోడి కంట్లో యాష్.!తేడా వస్తే మటాష్!సిల్లీ యూత్.!
హైదరాబాద్ : పలు నగరాల్లో యువత వెర్రిపోకడలు శృతిమించుతున్నాయి. నాగరికత, అధునాతన పద్దతులు, కొత్తదనం పేరుతో యువత ప్రవర్తన పరాకాష్టకు చేరుతోంది. మొఖం మీద జుట్టు ఉంటుందో, జుట్టు కింద మొఖం ఉంటుందో అర్ధం కాని కటింగ్ తో, కంచె దగ్గర మేక ఆకులు నమిలినట్టు ఎప్పుడూ పాన్, గుట్కా నములుతూ, తోచిన చోట తట్టెడు ఉమ్మేస్తూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారు నేటి యువత. అంతే కాకుండా ద్విచక్ర వాహనంపై ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో స్మోకింగ్ చేస్తూ పక్కవస్తున్న వాహన దారులకు, వెనక వచ్చే వాహన దారులకు నరకం చూపిస్తున్నారు నేటి యువత.

రెచ్చిపోతున్న యువత.. హద్దూ అదుపూ లేదు..
సమాజంలో మంచి చెడులను ప్రతిసారి ఉపాద్యాయుడు బోధించాలంటే చాలా కష్టం. క్రమశిక్షణ, మంచి నడవడిక, నడత నేర్చుకోవాల్సిన సమయంలో నేర్చుకోకపోతే చాలా అనర్థాలు చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా మంచికి చెడుకు ఉన్న సూక్ష్మ భేదాన్ని తెలుసుకోకుండా విపరీతమైన స్వేఛ్చను అనుభవిస్తుంటారు కొందరు. అదే స్వేఛ్చ ఇతరులపాలిట నరకంగా మారినా వారు స్పందించరు, ఏమాత్రం పట్టించుకోరు. ప్రస్తుత నగర యువత పరిస్ధితి అచ్చం ఇలాగే పరిణమించింది.

శృతి మించిన ప్రవర్తన.. కరువైన క్రమశిక్షణ..
నగరంలో యువత పరిస్ధితి శృతిమించుతున్నా నియంత్రించేందుకు సాహసం చేయలేకపోతున్నారు కుటుంబ సబ్యులు. కుటుంబ సభ్యులే కాకుండా పోలీసులు సైతం కొన్ని అంశాల్లో ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. వాహనానికి సరైన పత్రాలు లేకపోతే జరిమానా వేయగలం కాని, గుణగానాల్లో, ప్రవర్తనలో, క్రమశిక్షణలో తేడా ఉంటే ఎలాంటి జరిమానా వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో నేర్చుకోవాల్సిన క్రమశిక్షణ వీధిలో నేర్పితే వస్తుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. యువత వెర్రిపోకడలకు వ్యవస్థలో చాలా వరకు విసిగిపోయిన సందర్బాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఒక చేతితో డ్రైవింగ్.. మరో చేతితో స్మోకింగ్.. వింత పోకడలకు సామాన్యులు బలి
ఇటీవల యువత ద్విచక్ర వాహనాలపై వింత పోకడలకు బరితెగిస్తున్నారు. ఎదుట పోలీస్ చెకింగ్ ఉందంటే అంతే వేగంతో వెనక్కి తిరిగి రాంగ్ రూట్ లో రయ్ మని పోలీసులకు మస్కా వేస్తున్నారు. ఈ క్రమంలో వాహనం ఇతర వాహనాన్ని డాష్ కొట్టినా డోంట్ కేర్ అన్నట్టు దూసుకెళ్తున్నారు వెర్రి యువత. మరికొంత మంది ఒకచేత్తో వాహనాన్ని నడుపుతూ మరోచేత్తో ఫోన్ మాట్లాడుతూ గమ్య స్థానం చేరుకునే వరకూ వెనక వారికి చుక్కలు చూపిస్తుంటారు. ఫోన్ మాట్లడుతూ డ్రైవింగ్ ఏంటి బ్రో అని అడిగితే వాడు కస్సుమని అరిచే అరుపులకు జీవితం మీద విరక్తి రావాల్సిందే...

పైశాచిక అనందం.. యువత వ్యవహారంపై విసుగెత్తుతున్న జనం..
అంతే కాకుండా ద్విచక్ర వాహనం నడుపుతూ పాన్, గుట్కా నములుతూ వాడికి తోచిన చోట ఉమ్మేయడం నగరంలో సర్వసాధారణంగా మారిపోయింది. వెనక వస్తున్న కార్లను గానీ, దిచక్ర వాహనదారులను అస్సలు పట్టించుకోకుండా వ్యవహరించే తీరు ఇతర వాహనదారులకు ఆగ్రహాన్ని కలిగించినా చేసేది ఏమీ ఉండదు. ఇక మరికొంత మంది యువకులు ఒకచేత్తే వాహనాన్ని నడుపుతూ మరోచేత్తో స్మోకింగ్ చేస్తూ అదో పైశాచిక అనందంతో ముందుకు సాగుతుంటారు. వీడి వల్ల వెనకవచ్చే వాహన దారుడు నరకం చూస్తున్నాడని అస్సలు పట్టించుకోడు. ఏంటనిప్రశ్నిస్తే తన బైక్, తన ఇష్టం. ఇది నగరంలో బరితెగించిన యువత ప్రపర్తన. పత్రాలు సరిగా లేని వాహనాలకు జరిమానా వేసినట్టు ప్రవర్తన సరిగా లేని యువతకు కూడా ఏదన్నా జరిమానా ఉంటే బాగుండనే అభియాలు వినిపిస్తున్నాయి.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications