Rains: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు.. దెబ్బతిన్న పంటలు..
తెలంగాణలో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల పంటల దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. ఇటు నిజామాబాద్ లో భారీ వర్షాల కారణంగా చెరువులు నిండి మత్తడి దుక్కుతోన్నాయి. బడా బీంగల్ లోని పెద్దచెరువు ప్రమాదకర స్థాయిలో ఉంది. చాలా చోట్లో పంటల పొలాల్లోకి నీరు చేరింది. ఇటు కరీంనగర్ జిల్లాలో వర్షాలతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
వరి, పత్తి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పొలాల గుండా వరద నీరు ప్రవహించడంతో ఇసుక మేటలు వేశాయి. పత్తిపంటలో నీరు నిలిచి తీవ్ర నష్టం జరిగిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు నిండిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వస్తోంది. అధికారులు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వికారాబాద్ జిల్లాల్లో ప్రాంతాల్లో వర్షాల వల్ల కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి.

సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పత్తి దెబ్బతిన్నది. ముఖ్యంగా నల్లరేడి భూముల్లో పత్తి తీవ్రంగా దెబ్బతిన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల అప్పర్ మానేరు మత్తడి దూకుతోంది. కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, మెదక్ కూడెల్లి వాగుల నుంచి అప్పర్ మానేరుకి వరద భారీగా వస్తోంది. దీంతో గంభీరావుపేట్, సిద్దిపేట ల మధ్య, నర్మాల - దుబ్బాకల మధ్య ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని జంట జలాశయాలు నిండిపోయాయి. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో మూసీలో వరద ప్రవహాం పెరిగింది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, భదాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications