Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దసరా బంపర్ ఆఫర్.. 51రూపాయలు కొట్టు.. మేక పట్టు!

తెలంగాణ గ్రామాలలో అప్పుడే దసరా పండుగ మొదలైంది. దసరా పండుగ సందర్భంగా గ్రామాలలో బంపర్ ఆఫర్లు నడుస్తున్నాయి. 51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు, 100 రూపాయలు కొట్టు... మేకను పట్టు... లక్కీ డ్రా లో మీరివి గెలుచుకుంటారు అంటూ పెద్ద ఎత్తున గ్రామాలలో దసరా ఆఫర్లు కొనసాగుతున్నాయి.

గ్రామాలలో దసరా ఆఫర్లు
ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా కూపన్లను ఇస్తూ ఆఫర్లను ప్రకటిస్తూ లక్కీ డ్రాలను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చిట్యాల, మర్రిగూడ తదితర మండలాలలో దసరా పండుగ సందర్భంగా కొందరు యువకులు 51 రూపాయలు కొట్టు మేకను పట్టు అని ప్రచారం చేస్తున్నారు. ఇక దసరా సందర్భంగా పెట్టిన ఈ స్కీం లో 51 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే ఆ కూపన్ల నుంచి డ్రా తీస్తారు.

Dussehra Bumper Offers Goat only Rs 51 Festival started in telangana villages

సోషల్ మీడియాలో రచ్చ
డ్రాలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 12 కిలోల మేకను, రెండవ బహుమతిగా రెండు రెడ్ లేబుల్ ఫుల్ బాటిల్స్, మూడో బహుమతిగా రెండు బ్లాక్ అండ్ వైట్ ఫుల్ బాటిల్స్, నాలుగో బహుమతిగా రెండు కడకనాథ్ నాటు కోళ్లను, ఐదో బహుమతిగా ఒక కార్టన్ బడ్వైజర్ బీర్లను ఇచ్చేటట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీని ద్వారా ఆ ప్రాంతాల జనాల నుండి భారీగానే వసూలు చేస్తున్నారు.

మాయ లేదు మోసం లేదు.. పూర్తిగా లక్ అంటూ
మర్రిగూడ మండలంలో కొన్నిచోట్ల 100 రూపాయలు కొట్టు మేకను పట్టు అంటూ ఇదొక లక్కీ డ్రా ప్రచారం సాగుతుంది లెంకలపల్లి, వెల్మకన్నె గ్రామాలలో దసరా ఆఫర్ గా 100 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే దసరాకి ముందు డ్రా తీస్తామని చెప్తున్నారు. ఇక ఇందులో పూర్తిగా మాయ లేదు మోసం లేదు.. చిన్న పిల్లలతో డ్రా తీయిస్తామని చెప్తున్నారు.

Dussehra Bumper Offers Goat only Rs 51 Festival started in telangana villages

బహుమతులతో దసరా పండుగ చేసుకోండి అంటూ
మొదటి బహుమతి 10 కిలోల మేక, రెండవ బహుమతి రెండు బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్స్, మూడవ బహుమతి ఒక కార్టన్ బీర్లు, నాలుగవ బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదువ బహుమతి ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా నల్గొండ జిల్లాలో దుమ్మురేపుతున్న ఈ ఆఫర్ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.

అదృష్టం పరీక్షించుకుంటున్న జనాలు
అయితే 50 రూపాయలు, 100 రూపాయలేగా పోతే పోయేది.. వస్తే మాత్రం అంతకు మించిన విలువైనవి వస్తాయి.. అదృష్టం బాగుంటే మేకనే మన సొంతం అవుతుందని చాలా మంది దసరా సందర్భంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దసరా ప్రచారాలపై దసరా పండుగను కూడా సొమ్ము చేసుకుంటున్న సదరు లక్కీ డ్రా ల నిర్వాహకుల పైన పోలీసులు దృష్టి సారించారు. ఈ ప్రచారాల పైన ఆరా తీస్తున్న పోలీసులు ఏం నిర్ణయం తీసుకుంటారో!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+