పెళ్లి కోసం ఫిబ్రవరి 17 నుంచి ఆమ్రపాలి లాంగ్ లీవ్, టర్కీలో హనీమూన్
వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి లాంగ్ లీవ్ పైన వెళ్తున్నారు. ఈ నెల 18వ తేదీన జమ్ము కాశ్మీర్‌లో ఐపీఎస్ అధికారి, డయ్యూ డామన్ ఎస్పీ సమీర్ శర్మతో వివాహం జరగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు లాంగ్ లీవ్ తీసుకుంటున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వరంగల్, హైదరాబాదులలో వివాహ రిసెప్షన్ ఉంటుంది. ఈ మేరకు హోటల్ బుకింగ్స్ కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది.
Recommended Video


హనీమూన్ కోసం టర్కీకి
ఆ తర్వాత 26వ తేదీన భర్త సమీర్ శర్మతో కలిసి ఆమె హనీమూన్ కోసం టర్కీ వెళ్తారని తెలుస్తోంది. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంకు సాధించిన ఆమ్రపాలి సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్
2014లో సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు ఆమ్రపాలి. అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఆమెను వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది. ఆమ్రపాలి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.

సమీర్ డయ్యూ డామన్ ఎస్పీగా
విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఉత్తరాదికి చెందిన ఐపీఎస్ సమీర్ శర్మతో కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని చేస్తున్నారు.

సివిల్స్‌లో 39వ ర్యాంకు
ఆమ్రపాలి తండ్రి కాట వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంక్ సాధించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications