రేవంత్ సర్కార్ అభ్యర్దనకు ఈసీ నో - వాట్ నెక్స్ట్..!!

తెలంగాణలో కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం సిద్దమైంది. ఈ సమయంలోనే ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ నిర్ణయాలను అమలు దిశగా ఆమోదించేందుకు ప్రభుత్వం సమాయత్తం అయింది. ఇందు కోసం ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరుతూ అభ్యర్ధన పంపింది. కానీ, ఈసీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అనుమతించలేదు. దీంతో, రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మంత్రులతో సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికలు..ఇటు సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ లేఖ రాసింది. ఈసీ అనుమతి కోసం నిరీక్షించింది. కానీ, ఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతో..రేవంత్ అందుబాటులో ఉన్న మంత్రులు...అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష ఏర్పాటు చేసారు. జూన్ 2వ తేదీతో ఉంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో, పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు.

EC Rejects permission for Telangana Cabinet meet amid Election code in the state

రైతు రుణ మాఫీపైనా
9,10 షెడ్యూల్ లోని ఆస్తులపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. రుణమాఫీ కోసం దాదాపు రూ. 40 వేల కోట్లు అవసరం. ఇందుకు సంబంధించి రైతు కార్పోరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అధికారులు బ్యాంకర్లతో ఈ అంశం పైన చర్చించి ప్రతిపాదనలు సిద్దం చేసారు. నేటి సమావేశంలోనే రైతు కార్పోరేషన్ పై నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే, కోడ్ అమల్లో ఉండటంతో ఈ అంశంపైన రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారుతోంది.

అధికారులకు నిర్దేశం
అదే విధంగా అధికారులతో సీఎం రేవంత్ ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించనున్నారు. జూన్ నెల అరంభం నుంచి ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, నీటి ప్రణాళికపై సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో పాటు వనరుల సమీకరణకు తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+