యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకపోతే బుల్‌డోజర్లతో: రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు: డెడ్‌లైన్
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్‌లో నివసించాలంటే బీజేపీకి ఓటు వేయక తప్పదంటూ హెచ్చరికలను జారీ చేసిన తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు టీ రాజా సింగ్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు నోటీసులను జారీ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో ఉండాలంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేసి తీరాల్సిందేనని, ఆయనకు ఓటు వేయని వారు దేశద్రోహులని ఆయన విమర్శించారు. దేశద్రోహులకు ఉత్తర ప్రదేశ్‌లో స్థానం లేదని స్పష్టం చేశారు.
యోగికి ఓటు వేయని వారిని తరిమి తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ వందల సంఖ్యలో బుల్‌డోజర్లు, జేసీబీలకు ఆర్డర్ ఇచ్చారని, వాటిని తెప్పిస్తున్నారని చెప్పారు. బుల్‌డోజర్లు, జేసీబీలను ఎందుకు తెప్పిస్తున్నారో.. తెలుసా? అని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్‌ను ఇష్టపడని వారు నివసించే ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైందని టీ రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

యోగిని ముఖ్యమంత్రిగా అంగీకరించని వారు ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి..తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. యోగికి వ్యతిరేక ఓటు పడిందనే విషయాన్ని ఆయన పరోక్షంగా వివరించారు. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి హిందు బంధువులందరూ మిగిలిన అయిదు దశల్లో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మూడోదశ పోలింగ్ సందర్భంగా హిందువులందరూ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత.. యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయని వారిని గుర్తిస్తామని, వారిని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. దీనికోసం బుల్‌డోజర్లు, జేసీబీలను యోగి తెప్పిస్తున్నారని, అవి బయలుదేరాయని కూడా రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యాలను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆయనకు నోటీసులను జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఓటర్లను బెదిరింపులకు గురి చేసిన నేరం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని అన్నారు. సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఐపీసీ, రెప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 కింద చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికలు కొనసాగుతోన్న సమయంలో- ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా, ఒక పార్టీకి ఓటు వేసేలా రాజాసింగ్ తన వ్యాఖ్యలతో ప్రభావితం చేసినట్లు ఈసీ అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications