కరెంట్ సమస్యలా.. దేశంలోనే తొలిగా తెలంగాణాలో ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ సేవలు
కరెంట్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? ఇంట్లో పవర్ ప్రాబ్లం ఉంటే ఎన్నిసార్లు కాల్ చేసినా, వెళ్లి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావట్లేదా? అయితే మీ కోసం తెలంగాణా ప్రభుత్వం అత్యవసర సేవల తరహాలో కరెంట్ సమస్యల కోసం ఒక కొత్త విధానం మొదలుపెట్టింది.
తెలంగాణాలో ఎలక్ట్రసిటీ అంబులెన్స్ సేవలు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణాలో ఎలక్ట్రసిటీ అంబులెన్స్ సేవలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదలుపెట్టారు. వైద్య అత్యవసరాలలో 108 సేవలు అందించే తరహాలోనే ఈ కొత్త సేవ పని చేస్తుంది. తీగలు తెగి పడటం, ట్రాన్స్ ఫార్మర్లు పేలటం, షార్ట్ సర్క్యూట్, విద్యుత్ అంతరాయాలు వంటి ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పుడు ప్రత్యేకంగా తయారు చేసే వాహనాలు, అనుభవజ్ఞులైన టెక్నీషియన్ ల బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు.

ఖమ్మం జిల్లాలో ఎలక్ట్రసిటీ అంబులెన్స్ లు
ఈ అంబులెన్స్ సేవలు మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు. ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఈ సేవ ద్వారా ప్రజలకు 24 గంటలు అత్యవసర విద్యుత్ సహాయం అందించనున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 4 - 5ఎలెక్ట్రసిటీ వాహనాలు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.తెలంగాణాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా మరింత సుస్థిరం చేయటం కోసం ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన అడుగు.
సత్వర సేవలను అందించటం కోసమే ఈ స్పెషల్ అంబులెన్స్ లు
సహజంగా వర్షాకాలంలో కరెంట్ తీగలు తెగిపోవటం, విద్యుత్ స్తంభాలు పడిపోవటం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో సాదాతన సర్వీస్ బృందాలు చేరుకోవటం కాస్త ఆలస్యం అవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అలాంటి జాప్యం లేకుండా ఎలెక్ట్రిసిటీ అంబులెన్స్ లు సత్వర సేవలను అందిస్తాయి.
సబ్ స్టేషన్ల విస్తరణ, కొత్త ఫీడర్ల నిర్మాణం, స్మార్ట్ మీటర్ల అమలుపై ఫోకస్
ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రజలకు 24 గంటలు నిరంతరాయ విద్యుత్ అందించటం కోసం కీలకంగా పని చేస్తుంది. టీజీ ట్రాన్స్ కో మరియు టీజీఎస్పీడీసీఎల్ సబ్ స్టేషన్ల విస్తరణ, కొత్త ఫీడర్ల నిర్మాణం, స్మార్ట్ మీటర్ల అమలు వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించటం లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఇవి మాత్రమే కాదు రాష్ట్రంలో విద్యుత్ శాఖ డిజిటల్ మ్యాపింగ్, ఫాల్ట్ డిటెక్షన్ సిస్టమ్ లను మెరుగుపరుస్తోంది. మొత్తంగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.












Click it and Unblock the Notifications