బీజేపీవి బోగస్ మాటలు; కాంగ్రెస్‌వి కల్లబొల్లి కబుర్లు: వాళ్ళను తరిమికొట్టండి!!
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ బిజెపి లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి కబుర్లు చెబుతోందని, బిజెపి మాటలు బోగస్.. నమ్మొద్దని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని పలు గ్రామాలకు పాలకుర్తి శివారులోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి బిజెపి, కాంగ్రెస్ ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరెవరో వస్తారు.. ఏవేవో మాటలు మాట్లాడతారని, వాళ్ళెవరూ వచ్చి చేసిందేమీ లేదని, చేసేది కూడా ఏమీ లేదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. అలాంటి వాళ్లను ఉరికించి కొట్టాలని మంత్రి ఎర్రబెల్లి ఘాటువ్యాఖ్యలు చేశారు. కొందరు ఇప్పుడిప్పుడే వలస పక్షుల్లా వాలిపోతున్నారని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి, ముక్కు మొహం తెలియని వాళ్ళను నమ్మవద్దన్నారు.

ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళను ఆదరించ వద్దన్నారు. కాంగ్రెస్, బీజేపీల వల్ల దేశం నాశనం అవుతుందని మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్ నాయకత్వం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా అవసరం అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్రాన్ని ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంలను చూడలేదు అంటూ మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వివరించారు.
బిజెపి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే గ్రామాల్లో ప్రజలు ఊరుకోవద్దు.. తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కెసిఆర్‌ను, నన్ను, పార్టీని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. తాను ఓటమి ఎరుగని నాయకుడిని అని, ఎంపీగా తాను ఏడుసార్లు గెలిచానని ఎర్రబెల్లి తెలిపారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తర్వాత ఎక్కువ సార్లు గెలిచిన వ్యక్తి తానేనని అన్నారు. కెసిఆర్, మీ అందరి అండదండలతో మంత్రిని అయ్యానని, ప్రజలకు సేవ చేసే మంచి శాఖలు ఇచ్చారని, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్నానన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తనకు, కెసిఆర్ కు ప్రజలు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications