బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్: కేసీఆర్, కేటీఆర్‌లపై మాజీ ఐఏఎస్ సంచలనం!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన పై అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.

తాజాగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచార సభలో యువతకు ఉద్యోగాల కల్పనపై హామీలను ఇచ్చారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను ఇస్తామని, అవసరం అయితే పబ్లిక్ సర్వీస్ కమీషన్ బోర్డును ప్రక్షాళన చేసి అయినా తెలంగాణా నిరుద్యోగ యువతకు ప్రతీ ఏడాది ఉద్యోగాలిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Ex-IAS officer sensational comments on KCR and KTR!!

ఇక ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాల దుర్మార్గపు పరిపాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమయిందని పేర్కొన్న మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కేటీఆర్ ను టార్గెట్ చేశారు.

ఇంకా ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు కేటీఆర్ బాబు .. కొంచెం ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు. KCR గారు గత 9 1/2 సం లలో ఒక్కసారి అయినా 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి అని అధికారులతో నిష్ణాతులతో సమావేశం పెట్టినారా? అంటూ నిలదీశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు బాస్? తెలంగాణ యువత మరో ఉద్యమం చేపట్టాలి అంటూ తేల్చి చెప్పారు.

బీజేపీ ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. వాళ్లూ అంతే అంటూ మండిపడ్డారు. బాప్ ఏక్ నంబర్, బేటా దస్ నంబర్ అంటూ కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాల గురించి మాట్లాడిన వీడియోలను జత చేసి ట్వీట్ చేశారు. ఇంకా తెలంగాణా ప్రజలు కేసీఆర్, కేటీఆర్ చెప్పే అబద్దాలు నమ్మే పరిస్థితిలో లేరని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+