రేవంత్ ... కేసీఆర్ మర్రిచెట్టు.. నువ్వో గంజాయి మొక్క!!
వరంగల్లో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలకెత్తనివ్వమని, హనుమకొండలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్
బిడ్డా రేవంత్.. బిఆర్ఎస్ చెట్టుని ఎలా మళ్ళీ మొలకెత్తనివ్వవో మేము కూడా చూస్తామంటూ సవాల్ విసిరారు. కెసిఆర్ ఒక మర్రి చెట్టు అని నువ్వు గంజాయి మొక్క అంటూ రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనను రాక్షసుడు అంటున్నాడని, ప్రజల కోసం తాను రాక్షసుడినేనని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నిన్న రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశపడ్డామని కానీ ఏమీ చేయలేదని పేర్కొన్నారు.

ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే నీ సభకు ఎందుకు రాలేదు?
అబద్ధాలు ఆడి, ప్రమాణాలు చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని ఆయన తెలంగాణ ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు. నిన్న సీఎం సభకు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే హాజరు కాలేదని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నీ సభకు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం అందర్నీ ఏమాత్రం కలుపుకొని పనిచేస్తున్నాడో నిన్న సభతో అర్థమైంది అన్నారు.
కాంగ్రెస్ వాళ్లు రేవంత్ పదవిని ఊడగొడతారని వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఒక చీటర్ అని, ఒక బ్రోకర్ అని, ఓ కబ్జాకోరు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదని త్వరలోనే కాంగ్రెస్ వాళ్లు రేవంత్ పదవిని ఊడగొడతారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అన్నారు. తెలంగాణ కోసం టిడిపిలో ఉన్న అందరం రాజీనామా చేస్తే రేవంత్ మాత్రం తప్పించుకుపోయాడని వ్యాఖ్యలు చేశారు.
తుమ్మితే ఊడిపోయే ముక్కు నీ పదవి
అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరని కాళోజీ గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసేవన్నీ కేసిఆర్ పథకాలేనని పేర్కొన్నారు. ప్రజలను కోటీశ్వరులను చేస్తానని చెబుతున్నాడని కానీ ఆయన బంధువులనే కోటీశ్వరులను చేస్తున్నాడని విమర్శించారు. నిన్న వరంగల్లో జరిగింది వంచన సభ అని పేర్కొన్నారు. . ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ హామీని నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నించారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు నీ పదవి అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications