ఏపీ పెట్టుబడులపై దాడిచేస్తున్న కేసీఆర్?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలపై కేంద్రం వైఖరిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఏపీకి ఆయిల్ రిఫైనరీ.. తెలంగాణా మాటేంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 60 వేల కోట్లతో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పైన వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఓవైపు విభజన హామీలలో భాగంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీల విషయంలో ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు.

Ex mp vinod kumar targets modi over ap bpcl oil refinery questioned telangana assurances

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మాటేంటి
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో ఉందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇక అదే షెడ్యూల్ లో ఉన్న ఏపీకి ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారని, ఆయిల్ రిఫైనరీ కంపెనీని ఏపీకి ఇస్తున్నారని మరి తెలంగాణ మాటేమిటి అంటూ మోడీ అమిత్ షా లను ప్రశ్నించారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చటం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

కేంద్రం చంద్రబాబుపై ఆధారపడింది
ఏపీలో ప్రాంతీయ పార్టీని గెలిపించారు కాబట్టి అక్కడ పెట్రో రిఫైనరీ కంపెనీ వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మీద ఆధారపడింది కాబట్టి అక్కడ హామీలు నెరవేరుస్తున్నారని, తెలంగాణలో ఆ పరిస్థితి లేకపోవడం వల్లే నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం హామీ ఇచ్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

Ex mp vinod kumar targets modi over ap bpcl oil refinery questioned telangana assurances

ఏపీ పెట్టుబడులపై బీఆర్ఎస్ దాడి
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని వీడి వెళుతున్న ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం బాధాకరమన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ తాము పట్టించుకునేది లేదని కొత్త తరాన్ని మళ్లీ తయారు చేస్తామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు మొత్తానికి ఏపీ పై అక్కసును వెళ్లగక్కారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అయితే ఈ వ్యాఖ్యలు ఏపీకి వచ్చే పెట్టుబడులపై బీఆర్ఎస్ దాడిచేస్తున్నట్లుందని, ఆ రాష్ట్రంలో మళ్లీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలనే ధోరణికి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+