సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వెళ్లే పలు రైళ్లు పొడిగింపు

Special Trains from Secunderabad and Kachiguda: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో.

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

Extension of several special trains from Secunderabad and Kachiguda

దక్షిణ రైల్వే అధికారులు కూడా రంగంలోకి దిగారు. తమిళనాడులోని పలు ప్రాంతాలకు నడిపిస్తోన్న ప్రత్యేక రైళ్లను పొడిగించారు. ఇదివరకే ప్రకటించిన చర్లపల్లి- కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లకు ఇవి అదనం. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన తొలి రైలు పట్టాలెక్కనుంది.

ఏప్రిల్ 2 నుంచి జూన్ 25వ తేదీ వరకు ప్రతి బుధవారం రాత్రి 9:50 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07230 ప్రత్యేక రైలు రెండో రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ వరకు ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5:15 నిమిషాలకు కన్యాకుమారి నుంచి బయలుదేరే నంబర్ 07229 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11:40 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పడిరిపులియూర్, చిదంబరం, మైలాడుథురై, కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండగల్, కొడైకెనాల్ రోడ్, మధురై, విరుధునగర్, సత్తూరు, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్, నాగర్‌కోయిల్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఇప్పుడు తాజాగా తమిళనాడుకు రాకపోకలు సాగిస్తోన్న ప్రత్యేక రైళ్లను పొడిగించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. నంబర్ 07191 కాచిగూడ-మధురై ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు పొడిగించారు. 07192 మధురై- కాచిగూడ ఏప్రిల్ 9 నుంచి మే 7వ తేదీ వరకు పొడిగించారు.

Take a Poll

అలాగే.. 07189 నాందెడ్- ఈరోడ్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు, 07190 ఈరోడ్- నాందెడ్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి మే 4 వరకు, 07435 కాచిగూడ- నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు, 07436 నాగర్ కోయిల్- కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 6 నుంచి మే 4 వరకు, 07601 సికింద్రాబాద్- విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్ 3 నుంచి మే 1 వరకు, విల్లుపురం- సికింద్రాబాద్ ఏప్రిల్ 4 నుంచి మే 2వ తేదీ వరకు పొడిగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+