ఫెయిల్యూర్ పొత్తు: పవన్ పార్టీతో దోస్తానా కటీఫ్ చెప్పిన కిషన్ రెడ్డి!!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి జనసేన పొత్తులు ఫెయిల్యూర్ కావడంతో తాజాగా బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలలో పొత్తులు ఉండవని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ తో సమానంగా పోరాటం చేస్తామని, అత్యధిక స్థానాలలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కిషన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం పై ప్రచారం మొదలుపెట్టాలని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు.

ఇక తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ పార్టీతో బిజెపి దోస్తానా తెగ తెంపులు అయినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేనకు ఎనిమిది స్థానాలు కేటాయించిన బిజెపి, ఏ ఒక్క స్థానంలోను జనసేన అభ్యర్థులు సత్తా చాటక పోవడంతో, ఈ ప్రయత్నాన్ని విఫల యత్నంగా భావించి ఈసారి పార్లమెంటు ఎన్నికలకు సింగిల్ గానే వెళ్లాలని నిర్ణయించింది.
ఈ క్రమంలోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న క్రమంలో ఆ పార్టీ తరపున కనీసం ఓట్లు పడకపోవడం పొత్తులకు దూరంగా ఉండాలని బిజెపి నిర్ణయానికి కారణంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బిజెపి, కనీసం పార్లమెంటు ఎన్నికలలో నైనా సత్తా చాటాలని భావిస్తున్న క్రమంలో పొత్తులపై క్లారిటీతో ఉంది. ఎలాంటి పొత్తులు లేకుండానే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలలో బిజెపి ఓటు బ్యాంకు పెరిగి, ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ, జనసేన తో పొత్తు బిజెపికి లాభం చేకూర్చ లేదన్న భావన తెలంగాణ బిజెపిలో వ్యక్తమౌతుంది. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేదు అన్న ఫీలింగ్ వారిలో బాగా ఉంది. ఈ క్రమంలోనే బిజెపి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు కటీఫ్ చెప్పినట్టు తెలుస్తుంది.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications