మాదాపూర్ లో ప్రముఖ లేడీ ఆర్కిటెక్ట్ డ్రగ్స్ పార్టీ.. ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్ట్!

డ్రగ్స్ కు చెక్ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ డ్రగ్స్ చాప కింద నీరులాగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో డ్రగ్స్ దందా జోరుగానే సాగుతున్నట్టు తాజాగా నమోదైన కేసు ద్వారా తెలుస్తుంది. తాజాగా మాదాపూర్ లోని ఒక ఓయో హోటల్ రూమ్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది.

డ్రగ్స్ కేసులో పట్టుబడిన ప్రముఖ కొరియోగ్రాఫర్
ఈ డ్రగ్స్ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డాడు. ఆయనతో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి కూడా పోలీసుల చేతికి చిక్కారు. టెలివిజన్ చానల్స్ లో నిర్వహించే డాన్స్ షోల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కన్హ మహంతి డ్రగ్స్ కేసులో పట్టు పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్టు సమాచారం.

Famous lady architect drugs party in Madhapur Famous choreographer arrested

ఓయో హోటల్ రూమ్ లో డ్రగ్స్ పార్టీ
హైదరాబాద్లో డ్రగ్స్ కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని భావించి, గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్ పెడలర్స్ ద్వారా బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి మాదాపూర్ లోని ఓయో హోటల్ రూమ్ లో పార్టీ చేసుకుంటున్న వారిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. డ్రగ్స్ పార్టీలో కన్హా మహంతి, ఆర్కిటెక్ట్ ప్రియాంకతో పాటు ఆమె స్నేహితురాలు ఒడిశాకు చెందిన ఆర్కిటెక్ట్ షాకీ, స్టాక్ ట్రేడర్ గంగాధర్ కూడా ఉన్నారు.

హైదరాబాద్ కు డ్రగ్స్... ఎవరెవరు ఉన్నారని ఆరా
ఇక వీరి నుండి పోలీసులు ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు మరో రెండు రకాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరికి ఈ డ్రగ్స్ ఎక్కడినుంచి ఎవరు తెచ్చారు? దీని వెనక ఎవరెవరు ఉన్నారు? అన్నదానిపైన మాదాపూర్ పోలీసులు కూపి లాగుతున్నారు. డ్రగ్స్ ను కూకటివేళ్ళతో లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.

Famous lady architect drugs party in Madhapur Famous choreographer arrested

వరుస వివాదాలలో కొరియోగ్రాఫర్లు
ఇటీవల కాలంలో కొరియోగ్రాఫర్లు వరుసగా వివాదాలలో పడుతున్నారు. మొన్నటికి మన జానీ మాస్టర్ పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు నమోదు అయ్యి, జైలు పాలు కాగా, ఇక ప్రస్తుతం కన్హ మహంతి డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+