9999.. తెలంగాణలో బైక్ రిజిస్ట్రేషన్ చుక్కలు చూపిస్తుంది

తెలంగాణలో బైక్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగాయి. అలాగే ఫ్యాన్సీ నంబర్ల ఛార్జీలు కూడా మూడింతలు అయ్యాయి. ప్రత్యేక నంబర్‌ ప్లేట్‌ల కేటాయింపు నిబంధనల్లో సైతం భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం- వాహనదారులులు తమకు నచ్చిన ప్రత్యేక నంబర్‌ను ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను రవాణా శాఖ వెబ్‌సైట్ www.transport.telangana.gov.in ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఉన్న 81వ నిబంధనలోని సబ్‌-రూల్ (1), (2), (4)లను తొలగించారు. సబ్‌-రూల్ (3)ను కొత్త నిబంధనలతో భర్తీ చేశారు. దీని ప్రకారం- వాహనదారులు దరఖాస్తు చేసుకున్న తేదీ నాటికి సీరియల్ ఆర్డర్‌లో కేటాయించిన చివరి నంబర్ నుండి వెయ్యి నంబర్లలోపు ప్రత్యేక నంబర్లను రిజర్వ్ చేస అధికారం రిజిస్టరింగ్ అథారిటీకి లభించింది. ఇప్పటివరకు ఈ వెసలుబాటు రిజిస్టరింగ్ అథారిటీకి ఉండేది కాదు.

Fancy number and 2 wheeler registration charged sky rocket in Telangana

ప్రత్యేక నంబర్లకు వర్తించే ఛార్జీలు ఇవీ..

'9999' నంబర్‌ కోసం వాహనదారులు రూ. 1,50,000 కట్టాలి. ఇది బేసిక్ మొత్తం.

రూ. 50 వేల పరిధిలో..

'1, 9, 6666' వంటి నంబర్లకు 1,00,000, '99, 999, 3333, 4444, 5555, 7777' వంటి నంబర్లకు 50,000 రూపాయలను చెల్లించాలి.

రూ. 40 వేల పరిధిలో..

'5, 6, 7, 123, 333, 369, 555, 666, 777, 1111, 1116, 1234, 2222, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 4455, 4545, 4599, 6669, 6789, 8055, 8888' వంటి నంబర్లకు ఇకపై రూ. 40,000లను చెల్లించాల్సి ఉంటుంది.

రూ.30 వేలు కట్టాల్సిన నంబర్లు..

'3, 111, 234, 567, 1188, 1818, 1899, 1999, 2799, 3636, 3999, 5678, 5999, 6999, 7999, 9009' వంటి నంబర్లకు 30,000 రూపాయల ఛార్జీని కట్టాల్సి ఉంటుంది.

రూ.20 వేల పరిధిలో ఉన్నవి..

'2, 4, 8, 11, 18, 27, 36, 39, 45, 55, 77, 143, 222, 405, 444, 456, 459, 786, 789, 909, 1112, 1122, 1212, 1233, 1269, 1314, 1359, 1889, 2223, 2255, 2259, 2349, 2525, 3335, 3344, 3399, 3555, 3789, 3888, 3969, 4446, 4554, 4567, 4777, 4959, 5445, 5559, 5589, 5599, 5666, 5679, 5859, 6336, 6699, 6777, 6786, 6969, 7779, 7799, 7979, 8889, 8899, 8999, 9099' వంటి నంబర్లకు 20,000 రూపాయల ఛార్జీగా నిర్ణయించారు.

  • ఈ కేటగిరీల్లో లేని ఇతర నంబర్ల కోసం ద్విచక్ర వాహనాలకు రూ. 3,000, ఇతర వాహనాలకు రూ. 6,000 ఛార్జీ కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత నంబర్‌ను రిజర్వ్ చేసుకోవడానికి 2,000 చెల్లించవచ్చు. దరఖాస్తులను ఉదయం 8 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.
  • ఒక ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే, బిడ్డింగ్ ద్వారా కేటాయింపు జరుగుతుంది. బిడ్‌లో పాల్గొనని దరఖాస్తుదారుల ఛార్జీని జప్తు చేస్తారు. ఒకవేళ బిడ్డర్లకు ప్రత్యేక నంబర్ లభించకపోతే రిజర్వేషన్ ఛార్జీలో 10 శాతం మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. బిడ్డింగ్ మొత్తం సబ్‌-రూల్ (3)లోని నిబంధనలలో పేర్కొన్న రుసుముల కంటే తక్కువగా ఉండకూడదు.
  • రిజర్వ్ చేసిన నంబర్‌ను సమర్పించిన తర్వాత మోటార్ వాహనాల చట్టం- 1988 ప్రకారం రిజిస్టర్ చేస్తారు. నంబర్ రిజర్వ్ చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు వాహనాన్ని సమర్పించకపోతే రిజర్వేషన్ రద్దు అవుతుంది. రద్దు చేసిన నంబర్‌ను వెంటనే తిరిగి నోటిఫై చేస్తారు.
  • ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపుతో రవాణా మంత్రిత్వ శాఖకు సంవత్సరానికి 120 కోట్ల రూపాయల ఆదాయం అందుతోంది. తాజాగా పెంచిన ఈ ఛార్జీలతో ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. 200- 250 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+