గద్వాల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతుల ఆగ్రహం.. వాహనాలకు నిప్పు .. తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు తీవ్ర ఉద్రిక్తతకు కారణంగా మారింది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్న కంపెనీకి చెందిన వాహనాలను తగలబెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ పనులు ప్రారంభించేందుకు అక్కడికి వచ్చిన గాయత్రీ కంపెనీకి చెందిన వారిని అడ్డుకున్నారు.

ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా కార్లు, టెంట్ లు ధ్వంసం చేసిన రైతులు
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు తీవ్రస్థాయిలో నిరసన బాట పట్టారు. గద్వాల్ జిల్లాలోని పెద్ద ధన్వాడ లో దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో కంపెనీ తరఫున పనులు చేయడానికి ఈరోజు పలు వాహనాలు వచ్చిన క్రమంలో ఆగ్రహానికి లోనైన స్థానిక రైతులు ఫ్యాక్టరీ పనులు చేయడానికి వచ్చిన వాహనాలను తగలబెట్టారు. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు.
కాలుష్యం కోరల్లో గ్రామాలు చిక్కుకుంటాయని ఆందోళన
కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పు పెట్టారు. కంపెనీకి చెందిన నిర్మాణపనులు చేయిస్తున్న కూలీలను రైతులు తరిమికొట్టారు. ఈ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు ఒకవేళ ఈ కంపెనీ ఏర్పాటు చేస్తే ధన్వాడ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది తీరంలో ఇటువంటి ఫ్యాక్టరీల ఏర్పాటు వల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు.
స్థానిక రైతుల డిమాండ్ ఇదే
ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, సమీప గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, దీంతో ఆందోళన చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతులు ఆందోళన చేపట్టనున్నారన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలం వద్ద మొహరించినా రైతుల ఆందోళనను పోలీసులు అదుపు చేయలేకపోయారు.
కంపెనీ ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని రైతుల హెచ్చరిక
భారీ సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో రైతులు కంపెనీకి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. 10 గ్రామాల రైతులు ఆందోళన చేపట్టి, ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications