హైదరాబాద్ లో రూ.4 కోట్ల ఫెర్రారీ బీభత్సం- ఒక్క తొక్కు తొక్కేసరికి అన్నీ తుక్కు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వేగంగా దూసుకొచ్చిన ఓ ఫెరారీ కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకుపోయింది. అనేక వాహనాలను ఢీ కొట్టింది. పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఫెరారీ కారు కూడా బాగా దెబ్బతింది. ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. రోడ్డు మధ్యలోని లైట్ మాస్ట్ సైతం ఒరిగిపోయిందంటే. కారు వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జూబ్లీహిల్స్ లో నందమూరి బాలకృష్ణ ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త క్రాంతి రెడ్డి ఈ కారును నడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫెరారీ (నంబర్ టీఎస్ 07 హెచ్ కే 8797) కారును వేగంగా డ్రైవ్ చేస్తోన్నప్పుడు దాని బ్రేకులు పనిచేయకపోవడం, హఠాత్తుగా స్టీరింగ్‌ లాక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఈ ఘటనతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

Ferrari Worth Rs 4 Cr Crashes After lost control and rammed into multiple vehicles in Hyderabad

సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ధ్వంసమైన వాహనాలను తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ట్రాఫిక్ భారీగా ప్రభావితం కావడంతో పలు వాహనాలను దారి మళ్లించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.అధిక వేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, కారు పక్క రోడ్డుపైకి దూసుకెళ్లి, ఎదురుగా వస్తోన్న వాహనాలతో పాటు అక్కడ పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలతో సైతం ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటోన్నారు.

ప్రమాద ధాటికి దెబ్బతిన్న వాహనాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. పెద్ద శబ్దం రావడం, వరుసగా వాహనాలను ఢీ కొడుతూ ఫెర్రారీ కారు దూసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాల్లోని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. కొందరు విషమంగా ఉన్నప్పటికీ, వారి ఆరోగ్య స్థితిపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అతి వేగం, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ వల్లే ఈ ఘటన సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+