రేవంత్ కోసం ఫ్లాష్ మాబ్ .. టీఆర్ఎస్ కౌంటర్ ఫ్లాష్ మాబ్ .. ఏం క్రియేటివిటీ రా నాయనా
ఎన్నికల సమయం దగ్గర పడుతుంది .తెలంగాణా రాష్ట్రంలో హోరాహోరీగా సాగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వర్సెస్ మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి తలపడుతున్నారు . ప్రచారంలో కొత్త ట్రెండ్ సెట్ చేశారు ఇరువురు అభ్యర్ధులు . గత ఎన్నికల్లో ఓటమి పాలై ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజక వర్గ ప్రజలకు చేరువ కావటానికి కొత్త రకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫ్లాష్ మాబ్ లతో ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి ఓటుకు నోటు వ్యవహారం ఫ్లాష్ మాబ్ గా చేయిస్తూ ప్రజలకు రేవంత్ రెడ్డి పై కౌంటర్ ప్రచారం చేస్తున్నారు .

ప్రచారంలో ఫ్లాష్ మాబ్ లతో కొత్త పుంతలు తొక్కుతున్న పార్టీలు
మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కోసం యువత ముందుకొచ్చారు . రేవంత్ రెడ్డి కోసం ఫ్లాష్ మాబ్ లు నిర్వహిస్తున్నారు.ఇక రేవంత్ కు కౌంటర్ గా టీఆర్ఎస్ సైతం ఓటుకు నోటు వ్యవహారాన్ని ఫ్లాష్ మాబ్ గా చేయిస్తూ ప్రచారం చేస్తున్నారు. మరో మూడు రోజులే ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్న నేపధ్యంలో ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.

రేవంత్ కోసం ఫ్లాష్ మాబ్లు ... రేవంత్ కు కౌంటర్ గా ఒతుకునోటు ఫ్లాష్ మాబ్లు
రేవంత్ కోసం 20 మంది యువకులతో కూడిన బృందం కొత్తపేట మార్కెట్లోనూ , అలాగే కొత్తపేట నుండి దిల్ సుఖ్ నగర్ మెట్రో రైలులో కూడా ఫ్లాష్ మాబ్ నిర్వహించారు . ఇక దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ పార్టీ కూడా తన క్రియేటివిటీ ప్రదర్శిస్తుంది. ఎక్కడైతే రేవంత్ ఫ్లాష్ మాబ్ నిర్వహించారో అక్కడే టీఆర్ఎస్ సైతం ఓటుకు నోటు వ్యవహారం టార్గెట్ గా ఫ్లాష్ మాబ్ నిర్వహించి రివర్స్ కౌంటర్ వేసింది.

మల్కాజ్ గిరి ప్రచారంలో క్రియేటివిటీ చూపిస్తున్న పార్టీలు
మొత్తానికి మల్కాజ్ గిరి పోరులో కొత్త పంధాలో ప్రచారం సాగిస్తూ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ సారి మల్కాజ్ గిరి స్థానం గెలవటం ఇరు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం కావటంతో ఇరు పార్టీలు హోరాహోరీగా పోరాటం చేస్తున్నాయి . గత ఎన్నికల్లో ఓటమిపాలై ఘోర పరాభవాన్ని చవి చూసిన రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి స్థానంలో టీడీపీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మల్కాజ్ గిరి నుండి ఎన్నికల బరిలోకి దిగి టీఆర్ఎస్ పార్టీతో తలపడుతున్నారు .
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications