హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త జిల్లాలు కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్, అందుకే, ఏపీ-టిలపై మోడీ ట్వీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

సీఎంతో పాటు సభాపతి మధుసూదనాచారి, ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

అక్కడినుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి లుంబినీ పార్క్ వద్దకు చేరుకుని అమరవీరుల స్మృతి చిహ్నానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సంజీవయ్య పార్క్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయజెండాను ఆవిష్కరించారు. దేశంలోనే అతి పెద్దదైన 300 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై 108 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పుగల జాతీయపతాకం ఇది. దీనిని ఆవిష్కరించారు.

ఆ తర్వాత పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దసరా నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 14 నుంచి 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.

కొత్తగా రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త జిల్లాల అంశంపై పలుచోట్ల రగడ రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో వాయిదా వేసినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నాడు కొత్త జిల్లాలను ప్రకటిస్తారని ముందుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

కాగా, తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు దేశ ఆసలు, ఆకాంక్షలను నెరవేర్చే సత్తా ఉందని పేర్కొన్నారు. భారత దేశాన్ని సమష్టిగా బలోపేతం చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు. ప్రజు చిత్తశుద్ధి, కఠోరశ్రమ విధానం దేశాభివృద్ధిని మరింత పుంజుకునేలా చేస్తోందన్నారు. అలాగే, ఏపీ ప్రజలకు కూడా ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ పతాకం

జాతీయ పతాకం

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అతిపెద్ద మువ్వన్నెల జెండాను కేసీఆర్ గురువారం ఉదయం సంజీవయ్య పార్కులో ఆవిష్కరించారు.

జాతీయ పతాకం

జాతీయ పతాకం

72 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పుతో ఈ పతాకాన్ని రూపొందించారు. 300 ఫీట్ల ఎత్తైన స్తంబం పైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జాతీయ పతాకం

జాతీయ పతాకం

జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీర్, స్పీకర్ మధుసూదనా చారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

జాతీయ పతాకం

జాతీయ పతాకం

సంజీవయ్య పార్క్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయజెండాను ఆవిష్కరించారు. దేశంలోనే అతి పెద్దదైన 300 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై 108 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పుగల జాతీయపతాకం ఇది. దీనిని ఆవిష్కరించారు.

పరేడ్ గ్రౌండ్

పరేడ్ గ్రౌండ్

రాష్ట్ర అవతరణ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

పరేడ్ గ్రౌండ్

పరేడ్ గ్రౌండ్

సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది, క్యాడెట్ల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులు కవాతును నిర్వహించారు.

English summary
Telangana CM KCR paid homage at Gun park on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X