కాంగ్రెస్ కండువా కప్పుకొన్న కడియం శ్రీహరి: క్యూలో మరికొందరు బీఆర్ఎస్ సిట్టింగులు

Kadiyam Srihari: ఊహించినట్టే- తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, భారత్ రాష్ట్ర సమితి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.

కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య కూడా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ దళిత నాయకుడు పార్టీ ఫిరాయించడం బీఆర్ఎస్‌కు భారీ నష్టంగా భావిస్తోన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన చేరిక బూస్ట్ ఇచ్చినట్టయిందనే అంచనాలు ఉన్నాయి.

former BRS leader Kadiyam Srihari and Kavya join Congress

మొన్నటికి మొన్న బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఆయన ధృవీకరించారు కూడా.

అదే సమయంలో బీఆర్ఎస్‌కే చెందిన మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం, కూతురితో సహా కాంగ్రెస్‌లో చేరడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్.. జిల్లాల పర్యటన చేపట్టిన కొద్దిసేపటికే కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారు.

ఇదివరకు- కడియం కావ్యను వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. కేసీఆర్ స్వయంగా ఆమె పేరును ప్రకటించారు. ఆ తరువాత కొద్దిరోజులకే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నియోజకవర్గం పరిధిలో పార్టీ తీరు ఏ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని, నాయకుల మధ్య సమన్వయం ఉండట్లేదని చెబుతూ కేసీఆర్‌కు లేఖ రాసి మరీ రాజీనామా చేశారు.

former BRS leader Kadiyam Srihari and Kavya join Congress

ఇప్పటికే బీఆర్ఎస్‌ నుంచి బయటికి వెళ్లిపొయిన నాయకుల సంఖ్య భారీగా ఉంటోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడారు. వారంతా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కండువాలను కప్పుకొన్నారు. సిట్టింగ్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, బొంతు రామ్మోహన్, టీ రాజయ్య, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి.. ఇలా చాలామంది బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన వారిలో ఉన్నారు.

ఈ వలసలు ఇప్పట్లో ఆగకపోవచ్చు. మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు బయటికి వస్తారంటూ ఇప్పటికే దానం నాగేందర్ వంటి నాయకులు స్పష్టం చేశారు కూడా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూపులు సారించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+