KCR: అమెరికాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అగ్రరాజ్యం అమెరికా వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా అమెరికా వెళ్లలేదు. 10 ఏళ్ల పదవీ కాలంలో ఆయన రెండు సార్లు మాత్రమే విదేశీ పర్యటన చేశారు. ఒకసారి చైనాకు వెళ్లగా.. మరోసారి సింగపూర్ వెళ్లారు. అతి తక్కువ విదేశీ పర్యటనలు చేసిన సీఎంగా నిలిచారు. అయితే కేటీఆర్ మాత్రం విదేశీ పర్యటనలు చేశారు.
కొద్ది రోజుల్లోనే కేసీఆర్ అమెరికాకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలోని ప్రముఖ నేతలు దీనిపై లీక్ లు ఇస్తున్నారని చర్చ జరుగుతోంది. కేసీఆర్ అమెరికా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కాలేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలోనే చదువుతున్నారు. మనవడిని చూసేందుకు కేసీఆర్ అమెరికా వెళ్తునట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు గ్యాబ్ ఇచ్చి మనవడితో గడిపే అవకాశం ఉంది. కేసీఆర్ తో ఆయన సతీమణి శోభా కూడా అగ్రరాజ్యం వెళ్లే అవకాశం ఉంది.

ఫిబ్రవరిలోపు కేసీఆర్ అమెరికా పర్యటన పూర్త అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ తన అమెరికా పర్యటనలో ప్రభాకర్ రావును కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు అమెరికా గ్రీన్ కార్డు పొందారు. దీంతో ఆయన మరో నాలుగేళ్ల వరకు ఇండియాకు రాకపోవచ్చని తెలుస్తోంది.
ఆయన కుమారుడు అక్కడే ఉండడంతో గ్రీన్ కార్డ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ప్రభాకర్ కు గ్రీన్ కార్డు వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications