యాపిల్ ఎయిర్‌పాడ్ల తయారీ తెలంగాణలోనే!: ఫాక్స్‌కాన్‌కు భారీ కాంట్రాక్ట్
తెలంగాణలోనే యాపిల్ ఎయిర్‌పాడ్లు తయారు కానున్నాయి. ఇందుకు కారణం.. యాపిల్ ఎయిర్‌పాడ్ల తయారీ కాంట్రాక్టును ఫాక్స్‌కాన్ దక్కించుకోవడమే.
హైదరాబాద్: తెలంగాణలోనే యాపిల్ ఎయిర్‌పాడ్లు తయారు కానున్నాయి. ఇందుకు కారణం.. యాపిల్ ఎయిర్‌పాడ్ల తయారీ కాంట్రాక్టును ఫాక్స్‌కాన్ దక్కించుకోవడమే. ఈ క్రమంలోనే ఐఫోన్లు సహా మరికొన్ని సెమీకండక్టర్లను మాత్రమే ఇప్పటి వరకు అందిస్తున్న ఈ సంస్థ ఇకపై ఎయిర్‌పాడ్లు కూడా తయారీ చేయనుంది. ఈ మేరకు వివరాలను సదరు సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌కు వెల్లడించారు.

చైనా తర్వాత హైదరాబాద్‌లోనే యాపిల్ ఎయిర్‌పాడ్ల తయారీ
చైనాకు చెందిన కంపెనీలు ప్రస్తుతం యాపిల్‌కు ఎయిర్‌పాడ్లను సరఫరా చేస్తున్నాయి. అయితే, చైనా నుంచి తయారీని ఇతర దేశాలకూ విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే తాజాగా ఫాక్స్‌కాన్‌తో యాపిల్ ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఇటీవల ఫాక్స్‌కాన్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

200 మిలియన్ డాలర్లతో హైదరాబాద్‌లో ఎయిర్‌పాడ్ల తయారీ కేంద్రం
ఫాక్స్‌కాన్ సీఈవో యాంగ్ లియూ ఇటీవల భారతదేశంలో పర్యటించిన సందర్భంగా భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. పర్యటనలో భాగంగా తెలంగాణలోనూ ఆయన పర్యటించారు. తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో కొత్త యూనిట్ ఏర్పాటు చేసి విస్తరిస్తామని చెప్పారు. తాజాగా, చేసుకున్న డీల్‌తో ఎయిర్‌పాడ్ల తయారీ కేంద్రాన్ని తెలంగాణలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం 200 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టవచ్చని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఫాక్స్‌కాన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హైదరాబాద్‌లో 2024 చివరినాటికి ఎయిర్‌పాడ్ల తయారీ ప్రారంభం
ఫాక్స్‌కాన్ తన అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ ద్వారా తెలంగాణలో ప్లాంట్ నెలకొల్పే అవకాశం ఉందని సదరు కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చని సమాచారం. అంతా అనుకున్నట్లుగా జరిగితే 2024 చివరి నాటికి ఎయిర్‌పాడ్ల తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యాపిల్ సూచన మేరకు ఫాక్స్‌కాన్ భారతదేశంలోనే ఎయిర్‌పాడ్లను తయారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ తెలంగాణలో పర్యటించిన సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో భేటీ అయిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉందని కొద్ది రోజుల క్రితం ఆయన లేఖ కూడా రాశారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఫాక్స్‌కాన్ తెలంగాణలో ఎయిర్‌పాడ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications