జీఈఎస్ 2017 స్పీకర్స్ లిస్ట్ ఇదే: సానియా, మిథాలీరాజ్, మానుషి చిల్లర్, గోపిచంద్‌కు చోటు
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, మిథాలీ రాజ్,
హైదరాబాద్: ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, మిథాలీ రాజ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ లాంటి వారి పేర్లు ఈ జాబితాలో చోటు దక్కింది.
నవంబర్ 28వ,తేదిన హైద్రాబాద్ హైటెక్స్‌లో జీఈఎస్ 2017 సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హజరుకానున్నారు.
ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు 1600 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అయితే ఈ సదస్సుకు హజరయ్యే ప్రతినిధులకు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు.

జీఈఎస్ సదస్సులో స్పీకర్లు వీరే
జీఈఎస్ సదస్సులో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. మిస్‌వరల్డ్ మానుషి ఛిల్లర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్, బాలీవుడ్ నటులు సోనమ్‌కపూర్, అదితీరావు హైదరీ, నటుడు రామ్‌చరణ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఈ జాబితాలో ఉన్నారు. ఈ సదస్సులో మొత్తం 50కుపైగా చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి.

పలు అంశాలపై చర్చలు
విద్యుత్, మౌలిక వసతులు, విద్య,, సైన్స్, ఫైనాన్షియల్, టెక్ అండ్ డిజిటల్ ఎకానమీ, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఈ చర్చలను నిర్వహిస్తున్నారు. ప్రారంభ సమావేశంలో ఇవాంకా, మోదీ ప్రసంగాలు ఉండనున్నాయి. పలు అంశాలపై ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు జీఈఎస్ 2017 సదస్సులో ప్రసంగించనున్నారు.

క్రీడలపై సానియా, మిథాలిరాజ్, పుల్లెలకు ఛాన్స్
క్రీడా వ్యాపారంలో విజయం అంశంపై సానియా మీర్జా, మిథాలీరాజ్, గోపీచంద్‌లతోపాటు వన్ చాంపియన్‌షిప్ ఉపాధ్యక్షులు చాత్రి సిత్యోంద్టాంగ్‌లు మాట్లాడనున్నారు.
ఫ్యూచర్ ఆఫ్ సినిమా అంశంపై రాంచరణ్ తేజ, అదితీరావ్‌హైదరీ, నెక్ట్స్ స్టేజ్ ప్రొడక్షన్స్ సంస్థ సీఈవో ఒనెకాచి స్టిఫానీ లినస్ ఇడాహొసాలు మాట్లాడనున్నారు. మీడియాలో మహిళలకు అవకాశాలపై మానుషి ఛిల్లర్, సోనమ్ కపూర్, కల్లీ పూరి తదితరులు ప్రసంగిస్తారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గాజులు
భద్రతా కారణాల రీత్యా లాడ్ బజార్‌లోని గాజుల దుకాణాన్ని ఇవాంకా సందర్శించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.లాడ్‌బజార్ నుంచి కొన్ని ఎంపిక చేసిన గాజుల దుకాణాలను ఫలక్‌నుమా ప్యాలెస్‌కే పంపించి.. తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు దుకాణాలకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఎంపిక చేసిన గాజులు, ఆయా దుకాణాల నిర్వాహకులను ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకెళతారు.

గోల్కొండలో శిల్పారామం బొమ్మలు
భద్రతా కారణాల రీత్యా శిల్పారామానికి ఇవాంకా సందర్శించే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. అయితే ముఖ్యమైన హస్తకళాకృతులను హెచ్‌ఐసీసీకే తరలించి.. చిన్న ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీనికి కూడ అనుమతి రాలేదు. మరో వైపు 29న గోల్కొండ కోటలో విందు కార్యక్రమం ఉన్నందున.. శిల్పారామం నుంచి కొన్ని హస్త కళాకృతులను గోల్కొండకు తరలించి ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications