గజల్ శ్రీనివాస్‌ను ఇంకా ఏం విచారిస్తారు: పోలీసులతో జడ్జి, వీడియోలతో అడ్డంగా బుక్కైనట్లే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలన్న పంజాగుట్ట పోలీసుల పిటిషన్‌ను గురువారం నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ కొట్టివేయడానికి కారణం కూడా ఉంది. ఓ యువతిని వేధించిన కేసులో అతను అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

  గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

  గజల్ శ్రీనివాస్‌ను మరో నాలుగు రోజుల పాటు విచారించి, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుంటామని చెబుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కానీ న్యాయమూర్తి దానిని తిరస్కరించారు. ఈ సందర్భంగా కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఓమిటని ప్రశ్నించారు.

  గజల్ శ్రీనివాస్ కేసు: కోర్టులో పోలీసులకు షాక్, 20 వీడియోలతో బిగుస్తున్న ఉచ్చు!

  ఇంకా ఆయనను ఏం విచారిస్తారు

  ఇంకా ఆయనను ఏం విచారిస్తారు

  రిమాండ్ రిపోర్టులో విచారణకు సంబంధించిన వివరాలను పొందుపరిచి, వీడియోలతో సహా అన్ని ఆధారాలనూ సంపాదించిన తర్వాత ఆయనను ఏం విచారిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

  బెయిల్ పైన వాదనలు

  బెయిల్ పైన వాదనలు

  గజల్ శ్రీనివాస్ నుంచి ఎటువంటి రికవరీ అవసరం లేదని రిపోర్టులో పేర్కొన్నారు కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో శుక్రవారం అతను మళ్లీ వేసిన బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగనున్నాయి.

  బెయిల్ ఉపసంహరణ, మళ్లీ పిటిషన్

  బెయిల్ ఉపసంహరణ, మళ్లీ పిటిషన్

  కోర్టు ఈ నెల 12వరకు ఆయనకు రిమాండ్‌ విధించింది. బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది తొలుత పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత గురువారం దానిని ఉప సంహరించుకున్నారు. శుక్రవారం మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

  బెయిల్ రాకపోవచ్చా?

  బెయిల్ రాకపోవచ్చా?

  కాగా, పోలీసుల వద్ద కచ్చితమైన ఆధారాలు ఉండటంతో గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ రాకపోవచ్చునని అంటున్నారు. వీడియోలు, ఫోటోలు స్పష్టమైన ఆధారాలను బాధితురాలు ఇచ్చారని, వీటిని చూపించి బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేస్తారని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Nampally court has rejected the custody petition of Ghazal Srinivas after the hearing on Thursday. Ghazal Srinivas filed bail petition again on friday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి