Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువత కోసం జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.!నగరంలో 90కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు.!

హైదరాబాద్: హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న క్రమంలో ప్రజలకు అన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, మౌలిక వసతుల తో పాటు, యువత శారీరిక, మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తెలిపారు. ఇంతకు ముందు ప్రయోగాత్మకంగా ఆయా జోన్ల పరిధిలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడం మూలంగా చాలా మంది ఆసక్తి కనబరచడంతో నగర వ్యాప్తంగా ప్రజల కోసం హైదరాబాద్లో అనువైన చోట్ల 90కిలో మీటర్ల మేర శాశ్వల, తాత్కాలక ట్రాక్ ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు మేయర్ విజయ లక్ష్మి స్పష్టం చేసారు.

నగరంలో సైక్లింగ్ వంటి మౌలిక వసతులకు ప్రాముఖ్యత.. స్పష్టం చేసిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి..

నగరంలో సైక్లింగ్ వంటి మౌలిక వసతులకు ప్రాముఖ్యత.. స్పష్టం చేసిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి..

నగరంలో సుమారు 709 కిలో మీటర్ల నాలుగు లైన్లు అంతకంటే ఎక్కువగా వెడల్పు గల రోడ్డు అందుబాటులో ఉన్నాయి. సిఅర్ఏంపి ద్వారా రోడ్లను చేపట్టి అందరికీ మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేసారు. అట్టి రోడ్లలో అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి ప్రస్తుత బిజీ ప్రపంచంలో శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వం పెరిగే విధంగా నగర ప్రజలకు మెరుగైన సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటుకు జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర మునిసిపల్, పరిపాలన, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు సైక్లింగ ట్రాక్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు మేయర్.

ఔత్సాహికుల ఆసక్తికి అనుగుణంగా సైక్లింగ్ ట్రాక్.. జీహెచ్ఎంసీ మరో వినూత్న ప్రయోగం

ఔత్సాహికుల ఆసక్తికి అనుగుణంగా సైక్లింగ్ ట్రాక్.. జీహెచ్ఎంసీ మరో వినూత్న ప్రయోగం

ఔత్సాహికుల ఆసక్తికి అనుగుణంగా సైక్లింగ్ ట్రాక్ ను కొన్ని ప్రదేశాలలో తాత్కాలికంగా మరికొన్ని ప్రాంతాల్లో శాశ్వతంగా నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు మేయర్ తెలిపారు. నగరం లో ఏర్పాటు చేసిన జోన్ల లో సుమారు 90 కిలోమీటర్లు పొడవు లో సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసినట్టు నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. ఎల్ బి నగర్ జోన్ లో హబ్సిగుడా క్రాస్ రోడ్డు నుండి ఉప్పల్ చౌరస్తా వరకు 3 కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్ పర్మనెంట్ గా ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెళ్లడించారు.

నగరంలో 90కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్.. ఏర్పాట్లు పూర్తి చేస్తున్న జీహెచ్ఎంసీ

నగరంలో 90కిలో మీటర్ల సైక్లింగ్ ట్రాక్.. ఏర్పాట్లు పూర్తి చేస్తున్న జీహెచ్ఎంసీ

బైరామల్ గూడ క్రాస్ రోడ్డు నుండి ఓవైసీ జంక్షన్ వరకు 4 కిలోమీటర్ల పర్మనెంట్ గా,చార్మినార్ జోన్ లో ఓవైసీ జంక్షన్ నుండి అరంఘార్ వరకు శాశ్వతంగా,
అరంఘార్ నుండి పిడిపి జంక్షన్ వరకు 4కిలో మీటర్లు శాశ్వత ట్రాక్ వేయనున్నారు. ఖైరతాబాద్ జోన్ లో కేబిఅర్ అరౌండ్ పార్క్ 6 కిలో మీటర్లు తాత్కాలికంగా, ఓయు కాలని జంక్షన్ సెనార్ వ్యాలీ, రోడ్డు నంబర్ 82 జూబ్లీ హిల్స్, రోడ్డు నంబర్ 45 జూబ్లీ హిల్స్ రోడ్డు లిమిట్ వరకు 6 కిలోమీటర్లు, శేరిలింగంపల్లి జోన్, దుర్గం చెఱువు కేబుల్ బ్రిడ్జి, ఐకియ నుండి బయో వర్సిటీ రాయదుర్గం వరకు, 6 కిలో మీటర్లు, కొంత బాగం శాశ్వత, తాత్కాలిక ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. ఖాజా దుర్గ జంక్షన్ నుండి కేర్ హాస్పిటల్ వరకు, లింక్ రోడ్డు నుండి ఖాజా గూడ రోడ్డు 6 కిలో మీటర్లు రోడ్డు, కూకట్ పల్లి ఐడిఎల్ చెరువు నుండి జేఎన్టీయు రెయిన్ బో విస్ట నుండి ఐడిఎల్ చెరువు వరకు 10కిలో మీటర్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు.

యువత శారీరక దృఢత్వం కోసంమే సైక్లింగ్ వ్యవస్ధ.. అందరూ వినియోగించుకోవాలన్న మేయర్

యువత శారీరక దృఢత్వం కోసంమే సైక్లింగ్ వ్యవస్ధ.. అందరూ వినియోగించుకోవాలన్న మేయర్

హైదరాబాద్ నుండి బాలానగర్ వరకు 25 కిలో మీటర్లు తాత్కాలికంగా, సికింద్రాబాద్ జోన్ లో మెట్టు గూడ క్రాస్ రోడ్డు నుండి హబ్సిగూడ క్రాస్ రోడ్డు వరకు 4 కిలోమీటర్లు, బుద్ధ భవన్ నుండి ఇందిరా గాంధీ విగ్రహం వయా నెక్లెస్ రోడ్డు 6కిలోమీటర్లు వరకు కొంత మేర శాశ్వత మరికొంత మేర తాత్కాలిక సైక్లింగ్ ట్రాక్ రోడ్డును ఏర్పాటుచేయనున్నారు. తాత్కాలికంగా సైక్లింగ్ ట్రాక్ పై ఉదయం 8 గంటల వరకు సైక్లింగ్ నిర్వహించిన తర్వాత తిరిగి ఆ రోడ్డును ట్రాఫిక్ అవసరాల కోసం ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటారు జీహెచ్ఎంసీ అధికారులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+