జీహెచ్ఎంసీ షాక్: ఐటీ కంపెనీలకు ఇంటర్నెట్ కట్?..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారులు ఇంటర్నెట్ కేబుల్స్ తొలగించడంతో నగరంలోని పలు ఐటీ కంపెనీల్లో మంగళవారం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి డీఎల్ఎఫ్ ఐటీ కారిడార్ ని ఆనుకుని ఉన్న జయభేరీ ఎన్‌క్లేవ్‌లోని ఖాళీ స్థలంలో విద్యుత్ స్తంభాలను అధికారులు తొలగించారు. దీంతో విద్యుత్ స్తంభంపై ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ను కూడా తొలగించాల్సి ఉంది.
ఆ ఖాళీ స్థలంలో పెట్ పార్కును నిర్మిస్తుండటంతో.. విద్యుత్ స్తంభాలను మార్చాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన, శేరిలింగంపల్లి సర్కిల్-20 ఉప కమిషనర్ వి.మమత పెట్ పార్కును సందర్శించారు. వారి సూచనలతో వెస్ట్ జోనల్ ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది క్రేన్ల సహాయంతో విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ తొలగించారు.

ముందస్తు సమాచారం గానీ నోటీస్ గానీ ఇవ్వకుండా కేబుల్స్ తొలగించడంతో ఐటీ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కి కూడా ఫిర్యాదు చేశాయి. అయితే జోనల్ కమిషనర్ హరిచందన మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో అక్కడ పెట్ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. ఇందులో భాగంగానే స్తంభాలపై ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ కూడా తొలగించాల్సి వచ్చిందన్నారు. అయితే కంపెనీలు అనుమతి తీసుకుంటే మళ్లీ కేబుళ్లను పునరుద్దరించేందుకు అవకాశం ఇస్తామని చెప్పారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications