GHMC షాకింగ్ నిర్ణయం.. "తెలుగు తల్లి" ఫ్లైఓవర్ పేరు మార్పు..!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రాధాన్యం పొందిన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం తీసుకుంది. మొత్తంగా 14 అంశాలపై చర్చ జరగగా.. అందులో ఇది ప్రధానంగా చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
కాగా హైదరాబాద్ లోని 1.1 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్‌కు ఇప్పటివరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరు ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఏర్పడిన ఈ పేరు ఇప్పుడు మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, GHMC స్టాండింగ్ కమిటీ దానిని "తెలంగాణ తల్లి ఫ్లైఓవర్"గా మార్చుతూ తీర్మానం ఆమోదించింది. కేవలం పేరు మార్పే కాకుండా.. ఫ్లైఓవర్‌కు రెండు వైపులా ఆర్చ్‌లను నిర్మించేందుకు GHMC ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ ఆర్చ్‌లపై తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక ప్రతీకలు, కళా రూపాలు ప్రతిబింబించేలా డిజైన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీని ద్వారా తెలంగాణ గౌరవం, సాంస్కృతిక వారసత్వం మరింత బలపడుతుందని భావిస్తున్నారు. GHMC ఆమోదం తెలిపిన ఈ ప్రతిపాదనను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం తుది ఆమోదం ఇస్తే, త్వరలోనే ఈ ఫ్లైఓవర్‌ను "తెలంగాణ తల్లి ఫ్లైఓవర్"గా అధికారికంగా ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications