అతనే కారణం.., నేను బతికుంటేనే ఎక్కువ బాధపడుతారు: భావన సూసైడ్ నోట్
ప్రేమ పేరుతో తనను వేధించడం.. తనకొస్తున్న సంబంధాలను కూడా అతను అడ్డుకోవడం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఇంటి మీదకొచ్చి గొడవ చేయడం.. తన లవర్ అంటూ అందరికీ ప్రచారం చేయడం ఆమె తట్టుకోలేకపోయింది.
షాద్‌నగర్: ప్రేమ పేరుతో తనను వేధించడం.. తనకొస్తున్న సంబంధాలను కూడా అతను అడ్డుకోవడం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఇంటి మీదకొచ్చి గొడవ చేయడం.. తన లవర్ అంటూ అందరికీ ప్రచారం చేయడం ఆమె తట్టుకోలేకపోయింది. చివరాఖరికి ఆత్మహత్య శరణ్యమంటూ ప్రాణాలు విడిచింది.

సూసైడ్ నోట్:
'అమ్మా.. నాన్న.. నేను లేకపోతే మీరెంతగా కుమిలిపోతారో తెలుసు.. కానీ నేను బతికుంటేనే మీరెక్కువ బాధ పడుతారు. ఇక ఈ జీవితం నాకు నచ్చలేదు. అన్నయ్య... అమ్మా నాన్న జాగ్రత్త..' ఇదీ చనిపోయే ముందు భావన రాసిన సూసైట్ నోట్.
Recommended Video


పెళ్లి రద్దు:
మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ యువకుడితో ఇటీవలే భావనకు నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేదీ ఖరారు చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. కొంతకాలంగా భావనను ప్రేమ పేరుతో వేధిస్తున్న గిరీష్.. ఆ సంబంధాన్ని చెడగొట్టాడు. ఆ యువకుడికి ఫోన్ చేసి భావన తాను ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. దీంతో పెళ్లి రద్దు చేసుకోవడానికి వారు సిద్దపడ్డారు.

కోలుకోలేకపోయింది:
పెద్ద కుటుంబం కావడం, జరిగిన అవమానంతో తలెత్తుకు తిరుగుతానన్న ఆందోళన వెంటాడంతో భావన తీవ్రంగా కుమిలిపోయింది. గిరీష్ ఆమె పెళ్లి చెడగొట్టినప్పటి నుంచి కోలుకోవడం ఆమె వల్ల కాలేదు. తాను బతికి ఉండటం వల్ల కుటుంబ పరువు పోవడంతో పాటు తల్లిదండ్రులను తీవ్రంగా బాధపెడుతున్నానని కుంగిపోయింది. చివరకు ఆత్మహత్యకే సిద్దపడింది.

గిరీష్ వల్లే:
తన పెళ్లి చెడగొట్టిన గిరీషే తన చావుకు కారణమని భావన సూసైట్ నోట్ లో పేర్కొంది. తనను చీట్ చేశాడని తెలిపింది. కాగా, భావనను తనకే ఇచ్చి పెళ్లి చేయాలంటూ గిరీష్ భావన తండ్రితో కొద్దిరోజుల క్రితం గొడవ పెట్టాడు. బయట అందరికీ భావన తన ప్రియురాలు అంటూ ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. ఆమెకు వచ్చే పెళ్లి సంబంధాలను కూడా చెడగొడుతూ వస్తున్నాడు. దీంతో తట్టుకోలేకపోయిన భావన చివరకు ఆత్మహత్యతో ప్రాణాలు విడిచింది.












Click it and Unblock the Notifications