మళ్ళీ బంగారం ధరల షాక్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు ధరలిలా!
బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయని సామాన్య ప్రజలు సంతోషపడే లోపే మళ్లీ బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈరోజు ప్రధాన నగరాలలో బంగారం ధరలలో పెరుగుదల నమోదయింది. మే మాసం ప్రారంభమైన నాటి నుంచి కాస్తో కూస్తో బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. అయితే తాజాగా నేడు బంగారం ధరలలో పెరుగుదల నమోదయింది. ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతం చూద్దాం.
దేశంలో నేడు పెరిగిన బంగారం ధరలు
నేడు దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,130 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల 87 వేల 200 రూపాయలుగా ఉంది. నేడు బంగారం ధర 24 క్యారెట్ల బంగారానికి 1200 రూపాయలు, 22 క్యారెట్ల బంగారానికి 1100 రూపాయలు మేర పెరిగింది.

ఢిల్లీ, ముంబై లలో బంగారం ధరలిలా
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 95 వేల 250 రూపాయలుగా, 22 క్యారెట్ల బంగారం ధర 87 వేల 350 రూపాయలుగా కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87 వేల 200 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95 వేల 130 రూపాయలుగా కొనసాగుతుంది.
ఏపీ, తెలంగాణాలలో బంగారం ధరలు ఇలా
ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,200 గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,130 రూపాయలుగా నేడు విక్రయం అవుతుంది. చెన్నైలో బంగారం ధరలు నేడు పెరిగిన లెక్కల ప్రకారం 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 87, 200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,130 రూపాయలు వద్ద కొనసాగుతుంది.
వెండి ధరల పరిస్థితి ఇలా
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ లో కాస్త బంగారం ధర ఎక్కువగా ఉంది. అయితే నేడు బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కిలో వెండి రేటు ఒక లక్షా ఎనిమిది వేల వద్దకు చేరింది. దేశవ్యాప్తంగా వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర 97 వేల రూపాయల వద్ద విక్రయం అవుతుంది.
-
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications