కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు: గోనే ప్రకాశ్ రావు క్షమాపణలు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఇటీవల టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈక్రమంలో గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలపై చట్టం ప్రకారం అవసరమైన చర్యను ప్రారంభించాలని ఐఏఎస్ అధికారుల సంఘం డీజీపీని కోరింది. గోనే ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు కలెక్టర్ హోదా విలువను తగ్గించడమే కాకుండా మహిళా అధికారి గౌరవాన్ని కించపరిచేలా ఉందని వారు తెలిపారు.

మారుమూల జిల్లాలో పనిచేస్తున్న ఓ నిబద్ధతగల అధికారిపై ఈ రాజకీయ నాయకుడు ఇలాంటి ప్రకటన చేయడం ఆమెను మాత్రమే కాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులందరినీ నిరుత్సాహానికి గురిచేస్తుందని అసోసియేషన్ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొంది.
Recommended Video
మహిళా అధికారికి వ్యతిరేకంగా చేసిన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు చట్టం ప్రకారం అవసరమైన చర్యను ప్రారంభించాలని అసోసియేషన్ డీజీపీని అభ్యర్థించింది. గోనే ప్రకాశరావు చేసిన వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోనే ప్రకాశ్ రావు.. కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు బాధించివుంటే క్షమించాలని కోరారు.












Click it and Unblock the Notifications